కావాల్సిన‌ పదార్థాలు:
చేపలు- అరకేజీ
టొమాటో- ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్టు- టీస్పూన్‌

 

పచ్చిమిర్చి- నాలుగు
కారం- రెండు టీస్పూన్లు
పసుపు- టీస్పూన్‌
కొత్తిమీర- కట్ట

 

ఉప్పు- తగినంత
ఉల్లిపాయలు- నాలుగు
జీలకర్ర పొడి- టీస్పూన్‌
ధనియాల పొడి- ఒక టీస్పూన్‌

 

తయారీ విధానం: ముందుగా చేప ముక్కలను నీటితో శుభ్రంగా కడిగి కొద్దిగా కారం, పసుపు, ఉప్పు వేసి కలియబెట్టి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత‌ ఒక పాన్‌ తీసుకొని నూనె వేసి కాస్త వేడి అయ్యాక చేప ముక్కలు వేసుకొని కాసేపు వేగించి పక్కన పెట్టుకోవాలి. మరొకపాత్రలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మరికాసేపు వేగించాలి. 

 

ఇప్పుడు కారం, జీలకర్రపొడి, ధనియాల పొడి వేసి కలపాలి. ఆ తర్వాత‌ అల్లం వెల్లుల్లి పేస్టు, టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు వేసి మరికాసేపు వేగించాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. తరువాత వేగించి పెట్టుకున్న చేప ముక్కలు వేసి మరికాసేపు ఉడికించాలి. చివ‌రిగా కొత్తిమీర వేసుకుని ఒక్క‌సారి క‌లిపి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే నోరూరించే చేపల ఇగురు రెడీ..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: