రొయ్యలు.. ఎంతోమంది ఇష్టమైన మాంసాహారం ఇది. అందుకే చాలామంది ఈ రొయ్యలతో ఎన్నో రకాల ఐటమ్స్ చేసుకుని తింటారు. రొయ్యల ఫ్రై అని.. రొయ్యల కర్రీ అని.. రొయ్యల వేపుడు అని ఇలా ఎన్నో రకాల రొయ్యల డిషెస్ చేసుకొని తింటారు. ఇకపోతే అలాంటివి అన్ని మనం తినే ఉంటాం. కానీ రొయ్యల కిచిడిని మాత్రం ఎప్పుడు తిని ఉండము.. అందుకే రొయ్యల కిచిడి ఎలా చెయ్యాలి ? ఎలా చేస్తే అద్భుతంగా ఉంటుంది అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. రొయ్యల కూరను ఆస్వాదించండి.  

 

కావాల్సిన పదార్ధాలు.. 

 

రొయ్యలు - కప్పు, 

 

పసుపు - అరచెంచా, 

 

సాంబార్‌ పొడి - చెంచా, 

 

పచ్చిమిర్చి తరుగు - చెంచా, 

 

అల్లం వెల్లుల్లి పేస్టు - చెంచా, 

 

ఉప్పు - తగినంత, 

 

కరివేపాకు రెబ్బలు - రెండు, 

 

టొమాటో, బంగాళాదుంప - ఒక్కోటి చొప్పున, 

 

కొబ్బరి తురుము - రెండు చెంచాలు, 

 

ఉల్లిపాయలు - రెండు, 

 

బియ్యం - రెండు కప్పులు, 

 

నానబెట్టిన పెసరపప్పు - టేబుల్‌ స్పూను, 

 

మినప్పప్పు - టేబుల్‌ స్పూను, 

 

నెయ్యి - రెండు టేబుల్‌ స్పూన్లు.

 

తయారీ విధానం... 

 

స్టవ్ మీద కుక్కర్‌ని పెట్టి అందులో నెయ్యి వేయాలి.. అది కరిగాక ఉల్లిపాయలు వేసి దోరగా వేగే వరుకు వేయించాలి. ఆలా అవి వేగాక పచ్చిమిర్చి తరుగూ, అల్లం వెల్లుల్లి ముద్ద, టొమాటో ముక్కలూ, కరివేపాకు రెబ్బలూ, కొబ్బరి తురుమూ, బంగాళాదుంప ముక్కలూ, రొయ్యలు వేయాలి. రొయ్యలు కొద్దిగా వేగాయనుకున్నాక కడిగిన బియ్యం, పెసరపప్పు, మినప్పప్పు, తగినంత ఉప్పూ, పసుపూ, సాంబార్‌పొడి, నాలుగున్నర కప్పుల నీళ్లు పోసి మూత పెట్టేయాలి. మూడు విజిల్స్ వచ్చాక దింపేస్తే చాలు. అంతే.. రొయ్యల కిచిడి రెడీ అయిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: