ఉసిరి సాంబారు .. తినడానికి ఎంతో రుచిగా అద్భుతంగా ఉంటుంది. అలాంటి ఈ ఉసిరి సాంబార్ ను మీరు ఎప్పుడైనా తిన్నారా ? ఎలా చేసుకోవాలో తెలుసా ? ఎలా చేసుకుంటే బాగుంటుందో తెలుసా ? అసలు ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. ఉసిరి సాంబారు ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది ఇక్కడ చదవండీ. 

 

కావాల్సిన  పదార్ధాలు.. 

 

ఉసిరికాయలు- ఆరు, 

 

కందిపప్పు- కప్పు, 

 

పసుపు- అరటీస్పూను, 

 

సాంబారుపొడి- 2 టీస్పూన్లు, 

 

పచ్చిమిర్చి- నాలుగు,

 

ఇంగువ- చిటికెడు, 

 

ఉప్పు- తగినంత, 

 

నూనె- టీస్పూను, 

 

కొత్తిమీర తురుము- 2 టేబుల్‌స్పూన్లు, 

 

ఎండుమిర్చి- రెండు, 

 

ఆవాలు- టీస్పూను, 

 

కరివేపాకు- 2 రెబ్బలు,

 

తయారీ విధానం... 

 

పచ్చిమిర్చిని నిలువుగా కోయాలి. కందిపప్పుతో పాటు ఉసిరికాయల్ని కడిగి ముక్కలుగా కోసి గింజలు తీసి, మెత్తగా ఉడికించాక అందులోనే పసుపు, పచ్చిమిర్చి వేసి మెదపాలి. ఆతరవాత ఈ ముద్దను ఉడికించిన కందిపప్పులో వేసి కలిపి తగినన్ని నీళ్లు పోసి, ఉప్పు, సాంబారుపొడి వేసి మరిగించాలి. ఇప్పుడు తాలింపు దినుసులతో పోపు చేసి సాంబారులో కలిపితే సరి. అంతే ఉసిరికాయ సాంబార్ రెడీ అయిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: