ఈ సృష్టిలోనే మధురమైనది.. మాతృత్వం. అయిన‌ప్ప‌టికీ వివాహమైన ప్రతి మహిళ మాతృత్వం పొందాలని.. పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ఎన్నో కలలు కంటుంది. మహిళ గర్భం దాల్చిందనే వార్త తెలియగానే అటు పుట్టింట్లో... ఇటు మెట్టింట్లో పండుగ వాతావరణం ఏర్పడుతుంది. అయితే స్త్రీలు గర్భం దాల్చిన నాటి నుంచి మళ్లీ డెలివరీ అయ్యేంత వరకు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డం అంటే మహిళలకు పునర్జన్మ లాంటిది. అలాగే ఈ ప్రపంచంలో అన్ని నొప్పులకంటే బిడ్డకు జన్మను ఇచ్చే సమయంలో తల్లి పడే ప్రసవ నొప్పులు తట్టుకోవడం ఒక్క మహిళలకే సాధ్యం అని అనడంలో అతిశయోక్తి లేదు. 

 

అయితే.. ప్రసవ సమయంలో నొప్పులు ఎక్కువగా ఎందుకు వస్తాయి..? అస‌లు అంత ఎక్కువ‌గా నొప్పులు రావ‌డానికి కార‌ణాలు ఏంటి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. బిడ్డకు జన్మను ఇచ్చే పవిత్రమైన గర్భాశయ ద్వారం బలహీనంగా ఉండటం వలన ప్రసవ సమయంలో నొప్పులు ఎక్కువగా రావడానికి ఒక కారణం. బిడ్డ ప్రసవించే సమయానికి తల ముందుకు వస్తూ బయటకు రావడం జరుగుతుంది. ఐతే కొన్నిసార్లు తలపై భాగంలో ఉండి కాళ్ళు ముందుకు వస్తుంటాయి. అటువంటప్పుడు నొప్పులు ఎక్కువగా రావడం జరుగుతుంది.

 

అలాగే తీసుకునే ఆహారంలో పోషకాలు, పౌష్టిక ఆహారం సరిగ్గా లేకపోవడం, రక్త వృద్ధిని పెంచే ఆహారాలు లేకపోతే ప్రసవ సమయంలో నొప్పులు, రక్తహీనత రావడానికి కారణమవుతుంది. ఇక బిడ్డ అధిక బరువుతో గానీ లావుగా ఉన్నప్పుడు ప్రసవ సమయంలో నొప్పులు ఎక్కువగా వ‌స్తుంటారు. ప్రగ్నన్సీ సమయంలో మీరు పడుకునే విధానం, నిద్రించే సమయం కూడా ప్రసవ సమయంలో నొప్పులపై ప్రభావం ఉంటుంద‌ట‌. అందుకే స‌రైన పోజీష‌న్‌లో ప‌డుకోవాలి. మ‌రియు గర్భంతో ఉన్నప్పుడు మంచి నిద్ర, ఎక్కువ నిద్ర కూడా అవసరం

మరింత సమాచారం తెలుసుకోండి: