కావాల్సిన ప‌దార్థాలు: 
బాదం పప్పు-  అర క‌ప్పు
కిస్ మిస్- అర క‌ప్పు
చక్కెర - ఒక కప్పు

 

జీడిపప్పు- అర కప్పు
తేనె- రెండు చెంచాలు 
పాలు- అర లీటరు

 

త‌యారీ విధానం: ముందు రోజు రాత్రి బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షలను రెండు కప్పుల నీటిలో నానబెట్టాలి. ఉదయాన నీటిని తీసేసి వాటిని మిక్సీ జ్యూస్ జార్లో వేసి బాగా తిప్పి అందులో పాలు, చక్కెర వేసి మరోమారు మిక్సీ పట్టాలి. 

 

దీన్ని గ్లాసుల్లో పోసి ఒక స్పూన్ తేనె, అర స్పూన్‌ నిమ్మరసం మ‌రియు కావాల‌నుకుంటే ఐస్ ముక్కలు వేసుకుంటే స‌రిపోతుంది. అంతే య‌మ్మీ య‌మ్మీ డ్రై ఫ్రూట్ జ్యూస్ రెడీ. ఇక డ్రైఫ్రూట్స్ లో ఉండే పోషకాల గురించి వినే ఉంటారు. 

 

అందుకే ఈ డ్రైఫ్రూట్స్ ను ప్రతి రోజూ తినమని చెబుతుంటారు. శరీరంలో ఒక బలమైన వ్యాధినిరోధక వ్యవస్థ పొందడానికి మీ రెగ్యులర్ డైయట్ లిస్ట్ లో ఈ డ్రైఫ్రూట్స్ ను చేర్చుకోవడం మంచి పద్దతి. అలాగే ఇలా జ్యూ స్ చేసుకుని తాగ‌డం వ‌ల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: