మాతృత్వం ఓ మధురమైన అనుభూతి.. మ‌రియు ఒక సవాలు వంటిది కూడా. అయితే మొదటిగా గర్భం ధరించటం వలన మీలో ఉత్సాహం మరియు అర్థంలేని భయం కలుగుతుంటాయి. గర్భిణీగా ఉన్న రోజుల్లో, గర్భిణీ స్త్రీకడుపులో పెరుగుతున్న శిశువు మీద ఎక్కువ శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది. మీ శిశువుగురించి ఒక సారి అవగాహన చేసుకుంటే చాలు, శ్రద్ద తీసుకోవడం చాలా సులభం అవుతుంది. మీరు గర్భంతో ఉన్నప్పుడు, మీకు పుట్టబోయే బిడ్డ గురించి అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటారు. మీరు ఎన్ని పుస్తకాలు చదివిన, మీ బంధువులు స్నేహితులు ఎన్ని విషయాలు చెప్పిన కూడా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలానే ఉంటాయి.

 

అందులో ఇప్పుడు చెప్పుకోబోయే విష‌యాలు కూడా కొన్ని. మ‌రి అవేంటో ఓ సారి లుక్కేసేయండి. కొన్ని సార్లు లేదా చాలా సార్లు, మీకు మీ బిడ్డకు మధ్య బంధం మొదటి చూపులోనే ఏర్పడిపోదు. మీరు అంత మాత్రాన మీరు మంచి తల్లి కాకుండా పోరు. తల్లి బిడ్డ మధ్య బంధం ఏర్పడడం కచ్చితం, కానీ కొంత సమయం పట్టచ్చు అంతే. అలాగే మీరు బిడ్డకు జన్మనిచ్చిన మరుక్షణం నుండి మీకందరు సలహాలు ఇవ్వడం మొదలు పెడుతారు. ఈ సలహాలు మీకు సహాయపడడం కన్నా, ఎక్కువ కంగారు పెడుతాయి. కానీ, ప్ర‌శాతంగా విని అందులో మీ బిడ్డకు ఉపయోగపడేవి ఉంటే వాటిని గుర్తుంచుకోవాలి.

 

పుట్టిన పిల్లలకు చలి ఎక్కువగా ఉంటుందనుకుని, చాలా మంది వారిని టవల్స్ తో, దుప్పట్లతో చుట్టేస్తారు.  కానీ మీరు అనుకునేంత చలి వారికీ ఉండదు. ఒకవేళ మీరు వెచ్చగా ఉన్నప్పుడు, ఇంకా వెచ్చగా చేయడానికి మిమ్మల్ని, దుప్పట్లతో చుట్టేస్తే, మీకు ఎలా ఉంటుంది. అలాగే పిల్లలకు కూడా.  పసి పిల్లలకు కూడా మొటిమలు వస్తాయి. పిల్లల చర్మం బయట  వాతావరణానికి అలవాటు అయ్యే ప్రయత్నంలో, ఇలా జరగవచ్చు. అయితే కొన్ని రోజులకు అవే తగ్గిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: