కావాల్సిన ప‌దార్థాలు:
చేప ముక్కలు- అరకేజీ
ఉల్లిపాయ- ఒక‌టి
స్ప్రింగ్‌ ఆనియన్స్‌- ఒక కట్ట
పచ్చిమిర్చి- నాలుగు

 

క్యాప్సికం- ఒక‌టి
వెనిగర్‌- ఒక‌టీ స్పూన్‌
మిరియాల పొడి- పావు టీస్పూన్‌
ఉప్పు- రుచికి తగినంత

 

అల్లం- చిన్న ముక్క
వెల్లుల్లి రేబ్బ‌లు- నాలుగు
సోయాసాస్‌- రెండు టీస్పూన్లు
కారం- ఒక టీ స్పూన్‌

 

గ్రేవీ కోసం:
కార్న్‌ ఫ్లోర్‌- నాలుగు టేబుల్‌ స్పూన్లు
వంట సోడా - రెండు చిటికెలు
బియ్యప్పిండి- రెండు టేబుల్‌ స్పూన్లు
ఉప్పు- అర టీస్పూను
కారం- ఒకటిన్నర స్పూను

 

తయారీ విధానం: గ్రేవీ పదార్థాలన్నీ తగినంత నీటిలో చిక్కగా కలిపి, చేప ముక్కలు ముంచి నూనెలో దోరగా వేగించి పక్క‌న‌పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నూనె వేసి తరిగిన క్యాప్సికం, ఉల్లి, స్ప్రింగ్‌ ఆనియన్స్‌, పచ్చిమిర్చి, మెదిపిన అల్లం, వెల్లుల్లి వేసి ఒక నిమిషం పెద్దమంటపై వేగించాలి. 

 

ఇప్పుడు మంట తగ్గించి సోయా సాస్‌, కారం, వెనిగర్‌, మిరియాలపొడి, పంచదార వేసి వేగించాలి. తర్వాత చేప ముక్కలు కలిపి మంట పెంచి ముక్కలకు గ్రేవీ బాగా పట్టిన తర్వాత దించేసి, కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి. అంతే నోరూరించే ఫిష్ మంచూరియా రెడీ..!

మరింత సమాచారం తెలుసుకోండి: