సమ్మర్ స్పెషల్.. ఏంటి అప్పుడే సమ్మర్ వచ్చేసిందా? ఎంత త్వరగా వచ్చేసింది అని అనుకుంటున్నారు కదా! అవును ఈసారి కళ్ళు మూసి తెరిచేలోపు సమ్మర్ వచ్చేసింది. అలాంటి ఈ సమ్మర్ లో ఎండలు చుక్కలు చూపిస్తాయి.. బయటకు వెళ్లి వచ్చావు అంటే బొగ్గు బొగ్గు అయిపోతావు.. సమ్మర్ సీజన్ ఆలా ఉంటది మరి.. 

 

అలాంటి ఈ వేడి వేడి ఎండలో చల్లటి స్వీట్ లస్సి తాగితే.. ఆహా అనకుండా ఉండలేరు. అంత అద్భుతంగా ఉంటుంది ఆ ఫీలింగ్.. సరే ఆ ఫీలింగ్ గురించి పక్కన పెట్టు.. అంత అద్భుతమైన ఫీలింగ్ తెప్పించే స్వీట్ లస్సి ఎలా చెయ్యాలో తెలుసా? చెయ్యడం తెలియకపోతే ఒకసారి ఇక్కడ చదివి తెలుసుకొండి. 

 

కావలసిన పదార్థాలు... 

 

పెరుగు- కప్పు, 

 

పంచదార- ఒకటిన్నర టీ స్పూన్‌, 

 

రోజ్‌వాటర్‌- టీస్పూను, 

 

చల్లని మంచినీళ్లు- 2 కప్పులు, 

 

యాలకులు- ఒకటి

 

తయారీ విధానం... 

 

యాలకుల గింజల్ని మెత్తగా దంచి పొడిలా చేసుకొని పక్కన పెట్టాలి... అనంతరం మిక్సీలో చల్లటి పెరుగు, పంచదార, రోజ్‌వాటర్‌, యాలకులపొడి వేసి, మంచినీళ్లు పోసి బాగా మిక్స్ చెయ్యాలి. అంతే.. లస్సి రెడీ.. ఇంకెందుకు ఆలస్యం.. మిట్ట మధ్యాహ్నం తప్పకుండా ఈ లస్సిని తాగండి.. అజా అనండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: