మహిళలు మామూలు సమయాల్లో కంటే గర్భ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ ఉద్యోగం చేసే మహిళలైతే మరింత జాగ్రత్త అవసరం. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఒక్కొక్కరి హెల్త్ ఒక్కోలా ఉంటుంది. వాళ్ల వాళ్ల శరీర తత్వాన్నిబట్టి.. వాళ్ల స్టామినా బట్టి ప్రెగ్నెన్సీ ఉంటుంది. కాబట్టి.. స్వంత నిర్ణయాలు తీసుకోకూడదు. డాక్టర్ సలహా ప్రకారం అన్నింటినీ ప్లాన్ చేసుకోవాలి. ఇక గర్భం దాల్చిన తర్వాత ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలనేది ప్రతి తల్లిలో ఉండే అనుమానం. 

 

ఎందుకంటే కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని సురక్షితంగా ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాలని కోరుకుంటుంది కాబట్టి. ఇందులో భాగంగా కొంతమంది మహిళలు  ప్రగ్నన్సీ సమయంలో జీడిపప్పు తీసుకోవచ్చా? అన్న అనుమాన‌లు ఉంటాయి. వాస్త‌వానికి గర్భంతో ఉన్నప్పుడు శిశువు పెరుగుదల సక్రమంగా జరగడానికి కావలసిన విటమిన్లు మొత్తం జీడిపప్పులో ఉన్నాయి. కాబట్టి ఎటువంటి భయం లేకుండా జీడిపప్పు తీసుకోవచ్చు. 

 

కానీ, పది గ్రాములకంటే ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాజూలో క్యాలరీలు అధికంగా ఉండటం వలన ఎక్కువ మోతాదులో తీసుకుంటే అధిక బరువు పెరిగే అవకాశం ఉంది. ప్రెగ్నన్సీ సమయంలో అధిక బరువు మంచిది కాదు. ఎక్కువ మోతాదులో తినడం వలన అధిక బరువు పెరగడమే కాకుండా కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. అలాగే జీడిపప్పును ఎప్పుడు విడిగా కాకుండా ఇతర డ్రై ఫ్రూట్స్ లేదా స్వీట్స్ తో కలిపి తీసుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: