ఈ  సృష్టికి మూలం అమ్మ. ప్రతి వ్యక్తికీ ఆది గురువు అమ్మ. నిస్వార్థమైన ప్రేమకు ప్రతి రూపం అమ్మ. ఆమెకు బిడ్డ ఆకలి తప్ప తన ఆకలి తెలియదు. ఇక ప్రెగ్నెస్సీ స‌మ‌యంలో ఏ ఆహారం తినాలి.. ఏ ఆహ‌రం తిన‌కూడ‌దు అన్న ఖ‌చ్చితంగా తెలుసుకోవాలి. అయితే ప్రగ్నన్సీ సమయంలో మునగ తీసుకోవడం ప్రమాదమా..? అని కొంద‌రికి డౌట్స్ వ‌స్తుంటాయి. గర్భం దాల్చిన తర్వాత మీరు తినాల్సిన ఆరోగ్యకరమైన ఆహారంలో ములక్కాడ ఒకటి. ముఖ్యంగా దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునగ ఒకటి. ఈ చెట్టు ఉపయోగాలు ఎన్నో..ఎన్నెన్నో.. చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే. 

 

పోషకాలు కూడా ఎక్కువే. మునగ కాయలే కాకుండా ఆకులు కూడా చాలా బలమైన ఆహారం. గర్భం దాల్చిన తర్వాత చాలామంది మహిళలలో ఉండే సమస్య ఉదయం నిద్రలేవగానే వికారం, వాంతులు, తల తిరగడం, యాక్టివ్ గా ఉండకపోవడం, అలసట ఉంటాయి. ఐతే మునగను  తీసుకోవడం వలన ఈ సమస్యలు ఉండవు. మధుమేహ బాధితులు మునగ ఆకు, మునగ కాయలు తీసుకోవచ్చా అని భయపడుతూ ఉంటారు. ఎటువంటి భయం లేకుండా మీ డైలీ ఆహారంలో మునగ ఆకును భాగంగా చేసుకోవడం వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. 

 

ప్రెగ్నన్సీ సమయంలో చాలావరకు మహిళలు బలహీనంగా ఉంటారు కాబట్టి మునగను తీసుకోవడం వలన ఎముకలు దృఢంగా, బలంగా ఉండేలా తోడ్పడుతుంది మరియు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అంతే కాదు ప్రసవ నొప్పులు చాలా సులభంగా వచ్చేలా చేస్తుంది. పోస్ట్ డెలివరీ కాంప్లికేషన్స్ ను తగ్గిస్తుంది. మ‌రియు ప్రసవం తర్వాత బిడ్డకు సరిపడా పాలు పడాలంటే మునగాకును తరచూ తింటుండాలి.  ఇక ఇందులో విటమిన్ సి ఉండటం వలన ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా ఆపుతుంది మరియు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: