కావాల్సిన ప‌దార్థాలు:
వంకాయలు- నాలుగు
బియ్యం- ఒక‌ కప్పు
చింతపండు రసం- ఒక చెంచా
ధనియాలు- ఒక‌ చెంచా
ఎండుమిర్చి- ఐదు

 

కొబ్బరి త‌రుము- అర క‌ప్పు
కొత్తిమీర- ఒక క‌ట్ట‌
నువ్వులు- ఒక టీ స్పూన్‌ 
మెంతులు- ఒక‌ చెంచా 

 

జీలకర్ర- ఒక టీ స్పూన్‌
ఆవాలు- అర టీ స్పూన్‌
మినపప్పు- ఒక టేబుల్‌ స్పూన్‌
సెనగపప్పు- ఒక టీ స్పూన్‌
ఏలకులు- రెండు

 

దాల్చినచెక్క- ఒక‌టి
లవంగాలు- రెండు
బెల్లంపొడి- ఒక టీ స్పూన్‌
ఉప్పు- రుచికి స‌రిప‌డా

 

త‌యారీ విధానం: ముందుగా  ఒక బౌల్‌లో బియ్యం తీసుకుని నీళ్ల‌తో క‌డిగి.. కుక్కర్‌లో వేయాలి. స‌రిప‌డా నీళ్లు పోసి విజిల్స్ వ‌చ్చాక స్టౌ ఆఫ్ చేయాలి. మ‌రియు వంకాయల‌ను ముక్క‌లుగా క‌ట్ చేసి.. వాట‌ర్‌లో వేసుకోవాలి. ఇప్పుడు పాన్ తీసుకుని మినప్పప్పు, జీలకర్ర, సెనగపప్పు, నువ్వులు, మెంతులు, లవంగాలు, ధనియాలను వేసి వేగించిండి. అవి కాస్త వేగాక ఎండుమిర్చి, తురిమిన కొబ్బరి వేసి ప‌చ్చి వాస‌న పోయేవ‌ర‌కు వేగ‌నిచ్చి స్టౌ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ దినుసులు కాస్త ఆర‌నివ్వాలి. 

 

ఆ త‌ర్వాత వీటిని  మిక్సీలో వేసి పొడి చేసుకోండి. ఇప్పుడు స్టౌ మీద మ‌రో పాన్ పెట్టుకుని నూనె, ఆవాలు, మినపప్పు, సెనగపప్పు, కరివేపాకు, పసుపు, వంకాయలు వేసి వేయించండి. ఆ త‌ర్వాత చింతపండు రసం, బెల్లం వేసి బాగా క‌లిపి.. స‌రిప‌డా ఉప్పు వేసి ఉడ‌క‌నివ్వండి. మ‌రియు ముందుగా పొడి చేసుకున్న‌ దినుసుల మిశ్రమాన్ని వేసి బాగా అన్నిటినీ కలపండి. ఇప్పుడు మూతపెట్టి ప‌ది నిమిషాలను ఉడకనివ్వండి. ఇక చివ‌రిగా మూత తీసి అన్నం, కొత్తిమీర‌ కూడా వేసి బాగా క‌లిపి రెండు నిమిషాలు ఆగి స్టౌ ఆఫ్ చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: