పిల్లలు సాయింత్రం సమయంలో ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్ లో ఖీమా సమోసా  ఒకటి. అయితే అలాంటి అద్భుతమైన ఆహారాన్ని ప్రతిరోజు బయట నుండి తెప్పించి పెట్టడం పిల్లల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే ఇంట్లోనే ఖీమా సమోసాని ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి. ఈ ఖీమా సమోసా వంటకం ఎంతో అద్భుతంగా ఉంటుంది. 

 

కావాల్సిన పదార్దాలు.. 

 

మైదా- పావుకిలో, 

 

ఖీమా- అరకిలో, 

 

ఉల్లిపాయ- ఒకటి, 

 

పచ్చిమిర్చి- నాలుగు, 

 

అల్లంవెల్లుల్లి- టేబుల్‌స్పూను, 

 

గరంమసాలా- ఒకటిన్నర టీస్పూన్లు,

 

కొత్తిమీర తురుము- 2 టేబుల్‌స్పూన్లు, 

 

పుదీనా తురుము- 2 టేబుల్‌స్పూన్లు, 

 

పెరుగు- టేబుల్‌స్పూను,

 

ఉప్పు- తగినంత, 

 

నూనె- వేయించడానికి సరిపడా

 

తయారు విధానం...  

 

మైదాలో కాస్త నూనె, నీళ్లు, ఉప్పు వేసి చపాతీ పిండిలా కలిపి చిన్న ఉండలుగా చేయాలి. ఒక్కో ఉండనీ చపాతీలా చేసి రెండుగా కోసి మూతపెట్టి ఉంచాలి. అలాగే రెండు టేబుల్‌ స్పూన్ల మైదాలో కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా కలిపి పక్కన ఉంచాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, అల్లంవెల్లుల్లి వేసి వేయించాలి. ఆతరవాత కీమా, ఉప్పు వేసి సిమ్‌లో ఉడికించాలి. ఇప్పుడు గరం మసాలా, పెరుగు, కొత్తిమీర, పుదీనా తురుము వేసి కలిపి దించేయాలి. ఇప్పుడు చపాతీని కోన్‌లా చుట్టాలి. అందులో కూర మిశ్రమాన్ని పెట్టి జాగ్రత్తగా మడిచి అంచులు విడిపోకుండా మైదా పేస్టుతో అతికించాలి. ఇలాగే అన్నీ చేసుకుని కాగిన నూనెలో వేయించాలి. అంతే ఖీమా సోమసాలు రెడీ. ఇంట్లోనే పిల్లలకు ఇష్టమైన ఆహారాన్ని ఇలా చేసి పెట్టండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: