సాధార‌ణంగా ప్రెగ్నెన్సీ అన్న గుడ్ న్యూస్ తెలియగానే పట్టలేనంత సంతోషంతో.. ఉంటారు. గర్భం ధరించిన మొదటి మూడు నెలలో చాలా ముఖ్యమైన దశ. గర్భం ధరించిన ప్రారంభ దశలో శరీరానికి కావల్సిన పోషకాహారాల అవసరాలను గుర్తించి జాగ్రత వహించాలి. గర్భిణీ స్త్రీలు తమ తొమ్మిది నెలలు పూర్తయ్యేసరికి అనేక సమస్యలు ఫేస్ చేస్తారు. బ్లోటింగ్, వెయిట్ గెయిన్, పొట్ట సమస్యలు.. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అవ‌న్నీ అదిగ‌మించి చివ‌రి ద‌శ‌కు చేరుకోవ‌డం కాస్త క‌ష్ట‌మైన ప‌నే అయినా.. ఆడ‌వాళ్లు మాత్రం ఎంతో ఇష్టంగా ఉంటారు. అలాగే ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు కడుపులో బిడ్డ ఎలా ఉన్నాడు, ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో తెలుసుకోవాలని ప్రతి తల్లికీ ఉంటుంది. 

 

ఇక కడుపులో బిడ్డ బరువు పెరగడానికి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలని గర్భంతో ఉన్న మహిళలకు వచ్చే అనుమానం. అయితే ఇక్కడ చెప్పుకునే ఈ ఆహారాలను గర్భిణీ స్త్రీలు తీసుకోవడం వలన  మీకు, మీ కడుపులో ఉన్న బిడ్డకు ఆరోగ్యకరం. గుడ్లు శాఖాహారమా, మాంసాహారమా అనే విషయాన్ని పక్కనపెడితే ప్రెగ్నన్సీతో ఉన్నపుడు గుడ్లు తినడం వలన గర్భంలో ఉండే శిశువు మెదడుకి కావలసిన కోలిన్ ను పొందవచ్చు. అలాగే బాగా ఉడికిన గుడ్లను మాత్రమే తీసుకోవాలి. 

 

మీరు మాంసాహారం తక్కువగా తినేవారైతే లేదా మాంసాహారం ఇష్టం లేకపోతే దీనికి బదులుగా బీన్స్ మరియు కాయ ధాన్యాలను తినడం ఉత్తమం. వీటిలో సమృద్ధిగా ఐరన్, ప్రోటీన్స్, ఫైబర్స్, ఫోలేట్ మరియు కాల్షియం ఉండటం వ‌ల్ల క‌డుపులోని బిడ్డ బరువు పెరిగేందుకు బాగా ఉపయోగపడతాయి. ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాస్ ఆరంజ్ జ్యూస్ సేవించడం వలన మీరు వికారం, వాంతుల నుండి బయటపడవచ్చు. మ‌రియు మీ క‌డుపులోని బ‌డ్డ‌కు కూడా ఎంతో మంచిది. అలాగే ప్రెగ్నన్సీ సమయంలో ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా డ్రై ఫ్రూట్స్ తినడం మీకు మీ బిడ్డ బరువు పెరుగుదలకు మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: