కావాల్సిన ప‌దార్థాలు:
మునగాకు- నాలుగు కప్పులు
ఆవాలు- రెండు టీ స్పూన్లు
మినప్పప్పు- మూడుటీ స్పూన్లు

 

నువ్వు పప్పు- ఒక‌టిన్న‌ర టీ స్పూన్‌
ఉప్పు- రుచికి స‌రిప‌డా
ఇంగువ- అర టీ స్పూన్‌
ఎండు మిర్చి- ప‌ది

 

చింతపండు- కొద్దిగా
పసుపు- పావు టీ స్పూన్‌
కారం- రెండు టీ స్పూన్లు
నూనె- అర కప్పు

 

తయారీ విధానం: ముందుగా మునగాకు కడిగి ఆరపెట్టుకోవాలి. మ‌రోవైపు చింతపండుకు కొద్దిగా నీళ్లు జత చేసి నానబెట్టాలి. ఇప్పుడు స్టౌ మీద పాన్‌లో నూనె వేసి.. అది కాగాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, నువ్వు పప్పు వరుసగా ఒకదాని తరవాత ఒకటి వేసి బాగా వేగాక ఎండు మిర్చి జత చేసి వేయించి.. ప‌క్క‌కు తీసుకుని చల్లార్చాలి. అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి కాగాక మునగాకు, పసుపు వేసి కొద్దిగా వేయించి దింపేయాలి. 

 

ఇప్పుడు వేయించుకున్న పోపును మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఆ త‌ర్వాత ఉప్పు, మునగాకు, నానపెట్టిన చింతపండు జత చేసి మరోమారు మిక్సీ పట్టి, గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద పాన్‌లో కొద్దిగా నూనె వేసి కాగాక కారం, ఇంగువ వేసి వేయించి, దింపి, పచ్చడిలో వేసి క‌లుపుకుంటే స‌రిపోతుంది. అంతే నోరూరించే మునగాకు పచ్చడి రెడీ..!

మరింత సమాచారం తెలుసుకోండి: