కావాల్సిన ప‌దార్థాలు: 
ఉల్లికాడలు- ఒక‌ కట్ట
పచ్చిమిర్చి- నాలుగు
కొత్తిమీర తురుము- కొద్దిగా

 

నూనె- త‌గినంత‌
అల్లం- అంగుళం ముక్క
ఉప్పు- రుచికి సరిపడా 
కరివేపాకు- నాలుగు రెబ్బలు

 

కొబ్బరితురుము- రెండు టీ స్పూన్లు
సెనగపప్పు- నాలుగు టీ స్పూన్లు
మినప్పప్పు-  నాలుగు టీ స్పూన్లు
ఆవాలు- అర టీ స్పూన్‌

 

తయారీ విధానం: 
ముందుగా ఉల్లికాడలు శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టౌ మీద పాన్‌లో కొద్దిగా నూనె వేసి సెనగపప్పు, మినప్పప్పు వేయించాలి. తరవాత అల్లం, పచ్చిమిర్చి వేసి వేగాక ఉల్లికాడల ముక్కలు కూడా వేసి ఓ రెండు మూడు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు ఉప్పు, కొత్తిమీర, కొబ్బరి తురుములు వేసి రెండు నిమిషాలు అటు ఇటు క‌లిపి స్టౌ ఆఫ్ చేయాలి.

 

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని చ‌ల్లార‌నిచ్చి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టుకుని నూనె వేయాలి. నూనె వేడి అయ్యాక ఆవాలు, సెనగపప్పు, మిన‌ప్ప‌ప్పు, క‌రివేపాకు, ఎండుమిర్చి వేసి వేగ‌నివ్వాలి. ఇప్ప‌డు ఈ తాలింపులో ముందుగా రుబ్బుకున్న చ‌ట్నీ వేసి క‌లిపి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే వేడి వేడి ఉల్లికాడల చట్నీ రెడీ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: