ప‌్రెగ్నెన్సీ టైమ్‌లో స్త్రీలు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. మందులు కూడా ఏవి ప‌డితే అవి వాడ‌కూడ‌దు. కేవ‌లం డాక్ట‌ర్‌ని సంప్ర‌దించి దాని ప్ర‌కార‌మే వాడాలి. అలాగే చిన్న జ‌లుబు, జ్వ‌రం వ‌చ్చినా ఎప్పుడూ కూడా డార్ట‌ర్ల‌ని సంప్ర‌దించి మందుల‌ను వాడాలి. త‌ప్పించి సొంత వైద్యం మంచిది కాదు. ఇక ఇదిలా ఉంటే అలాగే ఎక్కువ‌గా మేక‌ప్ అల‌వాటు ఉన్న మ‌హిళ‌లు కూడా గ‌ర్భం దాల్చినప్పుడు అన్ని కాస్మెటిక్స్ వాడ‌టం పెద్ద‌గా మంచిది కాదు.

 

వైద్యులు చెప్ప‌డం గ‌ర్భిణిలు ఎక్కువ‌గా మేక‌ప్ వేసుకోకూడ‌దు అంటారు. బ్యూటీ ప్రొడక్ట్స్‌లో వాడే కొన్ని రసాయనాలు మహిళల పునరుత్పత్తి వ్యవస్థ మీద దుష్‌ప్ర‌భావం చూపుతాయి. అందువల్ల ఈ మేకప్ వస్తువులు వాడే వారికి పుట్టే పిల్లలు తక్కువ బరువుతో లేదా పుట్టుక లోపాలతో ఉంటారని పరిశోధనల్లో తేలింది. ఆ కాస్మెటిక్స్ వాడ‌టం వ‌ల్ల అవ‌యవాల లోపం ఎక్కువ‌గా క‌నిపిస్తుంద‌ట‌. 

 

అలాగే మనం వాడే కొన్ని సబ్బుల్లో ట్రై క్లోరో కార్బన్ అనేది ఎక్కువ‌గా వాడుతుంటారు. దీనివల్ల గర్భిణీ స్త్రీలకు ప్రమాదం కలిగే అవకాశాలు ఎక్కువ శాతంలో ఉన్న‌ట్లు ప‌రిశోధ‌న‌లో తేలింది. కాస్మోటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు కూడా ఎక్కువ‌గా వ‌స్తాయి.  అలాగే స్కిన్ క్యాన‌ర్ వ‌చ్చే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంది. ఇది గర్భస్థ శిశువు ఆరోగ్యంపై ప్రతికూల వాతావరణం చూపిస్తుంది. అందువల్ల గర్భిణి స్త్రీలు కాస్మోటిక్స్ వస్తువులు వాడకపోవడమే మేలు. అంతగా మానలేకపోతే ముందుగా డాక్టర్ సంప్రదించి వారి సూచనల మేరకు వాడాలి. దాని కంటే కూడా ఎక్కువ‌గా ముఖం మంచి బ్యూటీగా గ్లోగా క‌నిపించాలంటే శ‌న‌గ‌పిండిని స్నానం చేసేట‌ప్పుడు దానితో రుద్ది స్నానం చేస్తే చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: