మష్రూమ్స్‌.. శాకాహారులకు ఇదే మాంసం. ఎందుకంటే ఈ మష్రూమ్స్‌ మాంసం కంటే రుచిగా ఉంటాయి. అందుకే ఈ మష్రూమ్స్‌ ను ఎన్నో రకాలుగా వండుకొని తింటుంటారు. మష్రూమ్స్‌ బిర్యానీ అని, ఫ్రై అని, కూరా అని, ఫ్రైడ్ రైస్ అని ఇలా ఎన్నో రకాల మష్రూమ్స్‌ రెసిపీని చేసుకొని తింటుంటారు. అయితే ఇప్పుడు మష్రూమ్ నూడుల్స్ ని ఎలా చేసుకోవాలో తెలుసుకొని తినండి.. 

 

కావాల్సిన పదార్థాలు.. 

 

పుట్టగొడుగులు- పావుకిలో, 

 

నూడుల్స్‌- పావుకిలో, 

 

ఉల్లిపాయలు- రెండు, 

 

వెల్లుల్లి- పది రెబ్బలు, 

 

క్రీమ్‌- కప్పు, 

 

చీజ్‌ తురుము- 2 టేబుల్‌ స్పూన్లు, 

 

వెన్న- 3 టేబుల్‌ స్పూన్లు, 

 

జీలకర్ర- టీ స్పూను, 

 

ఉప్పు- రుచికి సరిపడా, 

 

మిరియాల పొడి- అరటీస్పూను

 

తయారీ విధానం.. 

 

నూడుల్స్‌ను ఉడికించి నీళ్లు వంపి చన్నీళ్లతో కడగాలి. ఆతర్వాత పుట్టగొడుగుల్ని చిన్న ముక్కలుగా కోయాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు సన్నని ముక్కల్లా కోయాలి. పాన్ లో టేబుల్‌ స్పూను వెన్న వేసి వేడి అయ్యాక ఉడికించిన నూడుల్స్‌, చిటికెడు ఉప్పు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. ఇప్పుడు మిగిలిన వెన్న వేసి ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు వేసి బాగా వేయించాలి. పుట్టగొడుగుల ముక్కలు, జీలకర్ర వేసి రెండు నిమిషాలు వేయించాలి. తరవాత ఉప్పు, మిరియాలపొడి, నూడుల్స్‌, క్రీమ్‌ వేసి కాసేపు ఉడికించాలి. చివరగా తురిమిన చీజ్‌ వేసి ఓ నిమిషం వేయించి దించాలి. అంతే మష్రూమ్ నూడుల్స్ రెడీ.. 

మరింత సమాచారం తెలుసుకోండి: