రొయ్యలు.. ఎంతోమందికి ఇష్టమైన మాంసాహారం ఇది. అందుకే చాలామంది ఈ రొయ్యలతో ఎన్నో రకాల ఐటమ్స్ చేసుకుని తింటారు. రొయ్యల ఫ్రై అని.. రొయ్యల కర్రీ అని.. రొయ్యల వేపుడు అని ఇలా ఎన్నో రకాల రొయ్యల వంటకాలను చేసుకొని తింటారు. ఇకపోతే అలాంటివి అన్ని మనం తినే ఉంటాం. కానీ తందూరీ రొయ్యలు మాత్రం ఎప్పుడు తిని ఉండము.. అందుకే తందూరీ రొయ్యలు ఎలా చెయ్యాలి ? ఎలా చేస్తే అద్భుతంగా ఉంటుంది అనేది ఇక్కడ చదివి తెలుసుకోని.. ఇంట్లోనే చేసుకొని తినండి. 

 

కావాల్సిన పదార్ధాలు.. 

 

తందూరీ మసాలా - రెండు చెంచాలు, 

 

పెరుగు - రెండు టేబుల్‌ స్పూన్లు, 

 

రొయ్యలు - నాలుగు వందల గ్రా., 

 

ఉప్పు - కొద్దిగా, 

 

నూనె - రెండు టేబుల్‌ స్పూన్లు, 

 

ఇనుప కడ్డీలు - నాలుగు.

 

తయారీ విధానం..  

 

పెరుగు, రొయ్యలు, ఉప్పు , నూనె, తందూరీ మసాలా ఓ గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. ఇరవై నిమిషాల తరవాత ఈ రొయ్యల్ని ఇనుప కడ్డిలకు గుచ్చి.. నిప్పులపై కాల్చాలి. లేదా గ్రిల్‌ పద్ధతిలోనూ కాల్చుకోవచ్చు. అంతే ఎంతో రుచికరమైన తందూరీ రొయ్యలు రెడీ.. 

మరింత సమాచారం తెలుసుకోండి: