పప్పు.. అమ్మ చేసిన పప్పు అన్నం.. అమృతం అని చెప్పాలి. అయితే పప్పులో ఎన్నో రకాల పప్పులు ఉంటాయి. కంది పప్పు.. పచ్చి మిర్చి పప్పు, ఎర్రపప్పు, మెంతి పప్పు, కర్వేపాకు పప్పు అబ్బో ఇలా ఒకటి కాదు ఎన్నో రకాల పప్పు ఉంటాయి. అయితే ఇప్పుడు ఇక్కడ పుదీనా పప్పు ఎలా చెయ్యాలి అనేది చదివి తెలుసుకోండి. ఈ పుదీనా పప్పు ఆరోగ్యాన్ని ఇస్తుంది.. రుచిని ఇస్తుంది. అయితే ఈ పప్పు ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావాల్సిన పదార్ధాలు..  

 

పెసరపప్పు - అరకప్పు, 

 

ఉల్లిపాయ - ఒకటి చిన్నది, 

 

పుదీనా ఆకులు - ముప్పావు కప్పు, 

 

ఉప్పు - తగినంత, 

 

నెయ్యి - పెద్ద చెంచా, 

 

ఎండుమిర్చి - రెండు, 

 

నిమ్మరసం - 1/2 చెంచా, 

 

ఆవాలు - చెంచా, 

 

మినప్పప్పు - అరచెంచా,

 

ఇంగువ - చిటికెడు, 

 

కారం - అరచెంచా, 

 

పసుపు - పావుచెంచా

 

తయారీ విధానం..  

 

పెసర పప్పును మరీ మెత్తగా కాకుండా ఉడికించుకుని పక్కన పెట్టాలి. స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేసి అది వేడి అయ్యాక ఇంగువా, ఆవాలూ, మినప్పప్పూ, ఎండు మిర్చి వేసి వేయించాలి. తాలింపు వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి అవి వేగాక పసుపు, కడిగిన పుదీనా ఆకులు వేసి మంట తగ్గించాలి. పుదీనా ఆకులు మెత్తగా అయ్యాక తగినంత ఉప్పు, కారం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు వేసి కలపాలి. రెండు నిముషాలు అయ్యాక నిమ్మరసం వేసి దింపేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: