స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు, ఆమె చాలా విషయాల గురించి ఆందోళన చెందుతుంటుంది. ఆమె మనస్సులో అనేక అపోహాలు ఉంటాయి. ముఖ్యంగా ఏం తినాలి.. ఏం తిన‌కూడాదు.. క‌డుపులోని బిడ్డ ఎలా ఉన్నాడు..? ఇలా అనేక ప్ర‌శ్న‌ల‌తో గ‌ర్భ‌వ‌తులు స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. ఇటువంటి సమయంలో గర్భిణి చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఎప్పుడూ ఆందోళన చెందకూడదు. వాస్త‌వానికి అమ్మ అవ్వడం అనేది మహిళలకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం. అలాంట‌ప్పుడు ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేయాలేగాని.. ఆందోళ‌న చెంద‌కూడ‌దు. అయితే చాలా మంది గ‌ర్భ‌వ‌తుల‌కు ఉన్న ప్ర‌ధాన ప‌శ్న ప్రెగ్నెన్సీ టైమ్‌లో టీ, కాఫీలు తాగ‌వ‌చ్చా.. తాగితే ఏం అవుతుంది..?

 

అయితే మామూలు జనాలు అపరిమితంగా టీ,కాఫీలు తాగినా పెద్దగా సమస్యలు ఉండవు కాని.. గర్భిణీలు మాత్రం టీకాఫీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ, చాలామందికి కాఫీటీలు అలవాటు ఉండటం వలన గర్భం దాల్చిన తర్వాత కూడా వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. నిజానికి ప్రగ్నన్సీ సమయంలో టీ,కాఫీల‌కి దూరంగా ఉండటం ఉత్త‌మం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క‌నీసం అలా ఉండకపోయినా 200 మి.గ్రా. లకు మించకుండా తీసుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే.. ఇందులో కెఫీన్ అధికంగా ఉండటం వల్ల‌ మిస్ క్యారేజ్ అయ్యే ప్రమాదశాతం ఎక్కువగా ఉంది. 

 

అంతేకాకుండా.. ఈ కెఫిన్ వల్ల బేబీ మెటబాలిజమ్ రేట్ కంట్రోల్ లో ఉండదు. దీని వల్లనే చాలా సార్లు ముందుగా డెలివరీలు కావడం, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం లాంటివి జరుగుతుంటాయి. మ‌రియు తల్లులు కూడా ఈ కెఫిన్ వల్ల సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. దీని వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో మూత్ర సంబంధ సమస్యలతో బాధ పడతారు. అయితే.. ఈ కెఫిన్ ను లిమిట్ లో తీసుకుంటే ఎటువంటి అనార్థాలు ఉండవు. గర్భిణీలు పరిమితిలో కెఫిన్ తీసుకుంటే దాని వల్ల కొన్ని లాభాలు ఉంటాయి కాని నష్టాలు ఉండవు. ముఖ్యంగా కాఫీటీలు తాగ‌కుండా ఉండ‌లేము అనుకునే వాళ్లు పైన చెప్పిన‌ట్టు 200 మి.గ్రా. లకు మించకుండా తీసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: