కావాల్సిన ప‌దార్థాలు:
చేప ముక్కలు- పావు కిలో
వెల్లుల్లిరెబ్బల తురుము - టేబుల్‌స్పూను
పచ్చిమిర్చి తురుము- టేబుల్‌స్పూను
టమాటా సాస్‌- మూడు టేబుల్‌స్పూన్లు
బేకింగ్‌ పౌడర్‌- ఒక టేబుల్‌ స్పూను

 

సోయాసాస్‌- రెండు టేబుల్‌స్పూన్లు
మిరియాల పొడి- ఒక టేబుల్‌స్పూను
ఉప్పు - రుచికి తగినంత
అల్లం తురుము - టేబుల్‌ స్పూను

 

మైదాపిండి- అరకప్పు
మొక్కజొన్నపిండి- అరకప్పు
చిల్లీ సాస్‌- టేబుల్‌స్పూను
కొత్తిమీర - కొద్దిగా

 

త‌యారీ విధానం: 
ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో మొక్కజొన్న పిండి, మైదాపిండి, సోయాసాస్‌, బేకింగ్‌ పౌడర్‌, కొత్తిమీర తురుము, మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా నీరు పోసుకుని బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌపై పాన్‌ పెట్టుకొని, డీప్‌ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని వేడెక్కాక.. శుభ్రంగా క‌డిగిపెట్టుకున్న చేపముక్కల్ని పిండి మిశ్రమంలో ముంచి, నూనెలో వేసి డీప్‌ ఫ్రై చేసుకోవాలి. వేయించుకున్న చేప ముక్కల్ని తీసి ఒక ప్లేటులో వేసుకోవాలి. 

 

ఇప్పుడు స్టౌపై మ‌రో పాన్‌ పెట్టుకొని, కొద్దిగా నూనె వేసుకొని వేడెక్కాక అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తురుము వేసుకోవాలి. అవి కొద్దిసేపు వేగాక, సోయాసాస్‌, చిల్లీసాస్‌, టమాటాసాస్‌ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మొక్కజొన్నపిండిని కొద్దిగా నీటిలో కలిపి, ఆ మిశ్రమాన్నీ వేసుకొని ఉడికించుకోవాలి. ఇక చివరగా ముందుగా వేయించి పెట్టుకున్న చేప ముక్కలు, కొత్తిమీర‌ వేసుకొని బాగా క‌లిపి రెండు నిమిషాల త‌ర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే వేడి వేడి చిల్లీ ఫిష్ రెడీ..!

మరింత సమాచారం తెలుసుకోండి: