ఆహార ప్రియులకు ఎంతోమందికి ఇష్టమైన వంటకం ఏదైనా ఉంది అంటే అది చికెన్ అనే చెప్పాలి. ఎందుకంటే మాంసంలో ఎక్కువ శాతం ప్రజలు తినేది ఈ చికెన్ ని కాబట్టి. ఇకపోతే ఈ చికెన్ ని ఎన్నో రకాలు అద్భుతంగా చేయగలుగుతాం. అయితే అలాంటి ఈ చికెన్ ని కొబ్బరిపాలూతో ఎలా చెయ్యాలి ? ఎలా చేస్తే అద్భుతంగా ఉంటుంది అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావలసిన పదార్ధాలు.. 

 

చికెన్‌ - కేజీ, 

 

ఉల్లిపాయలు - 2, 

 

అల్లం తరుగు - 2 పెద్ద చెంచాలు, 

 

వెల్లుల్లి తరుగు - 3 పెద్ద చెంచాలు, 

 

కరివేపాకు రెబ్బలు - 2, 

 

బంగాళాదుంపలు - 2, 

 

ధనియాలపొడి - పెద్ద చెంచా, 

 

కారం - 2పెద్ద చెంచాలు, 

 

గరం మసాలా - చెంచా, 

 

పసుపు - అరచెంచా, 

 

చిక్కని కొబ్బరిపాలు - కప్పు, 

 

నూనె - అరకప్పు, 

 

కొత్తిమీర - కట్ట, 

 

యాలకులు - 3, 

 

లవంగాలు - 2, 

 

దాల్చిన చెక్క - చిన్న ముక్క, 

 

ఉప్పు - తగినంత. 

 

తయారీ విధానం.. 

 

స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె వేయాలి. అది వేడి అయ్యాక యాలకులూ, లవంగాలూ, దాల్చిన చెక్కా వేయించాలి... తరవాత ఉల్లిపాయ ముక్కలూ, అల్లం, వెల్లుల్లి తరుగూ, కర్వేపాకు రెబ్బలు వేసి అవి ఎర్రగా వేగాక ధనియాల పొడీ, కారం, పసుపు, గరం మసాలా వేసి వేయించాలి. రెండు నిముషాలు అయ్యాక చికెన్‌ ముక్కలూ, బంగాళాదుంప ముక్కలూ, కప్పు నీళ్లూ, తగినంత ఉప్పు వేసి మూత పెట్టాలి. చికెన్‌ ఉడికాక కొత్తిమీర తరుగూ, కొబ్బరిపాలు పోసి మూత పెట్టేయాలి. కాసేపటికి ఇది దగ్గరగా అవుతుంది. అప్పుడు దింపేయాలి. అంతే కొబ్బరి పాల చికెన్ రెడీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: