తెలుగమ్మాయి హంపి మరోసారి తెలుగు ఖ్యాతి నిలబెట్టింది. తెలుగు తేజం కోనేరు హంపి తాజా ప్రపంచ ర్యాంకింగ్స్ లో  రెండో స్థానం సాధించింది. 2586 రేటింగ్ పాయింట్లతో హంపీ రెండో స్థానంలో నిలిచింది. చైనాకు చెందిన యిఫాన్  అగ్రస్థానంలో కొనసాగుతోంది. 

 

 

హంపీ ఇటీవల మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ నెగ్గిన సంగతి తెలిసిందే. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా గ్రాండ్ మాస్టర్ గా రికార్డు కూడా సృష్టించింది. ఇక మరో తెలుగు అమ్మాయి ద్రోణవల్లి హారిక 2517 రేటింగ్  పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. 

 

 

ఓపెన్ ర్యాంకింగ్స్ లో ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్ అగ్రస్థానంలో ఉన్నాడు. జూనియర్స్ విభాగంలో భారత గ్రాండ్  మాస్టర్  జీఎం నిహాల్ సరిన్ పదో ర్యాంకులో నిలిచాడు. పురుషుల ఓపెన్  విభాగంలో టాప్  10 ర్యాంకుల్లో భారత ఆటగాళ్లకు స్థానం దక్కలేదు. 

 

మాజీ ప్రపంచ ఛాంపియన్  విశ్వనాథన్  ఆనంద్ 16 స్థానంలో నిలిచారు. విదిత్ సంతోష్ 22 వ స్థానంలో ఉన్నాడు. టాప్ టెన్ లో నిలిచిన ఇద్దరు అమ్మాయిలూ తెలుగు వారే కావడం విశేషం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: