సాధార‌ణంగా ఎవ‌రి జీవితంలో అయినా జీవితాంతం గుర్తుంచుకునే మ‌ధురానుభూతులు కొన్నే వ‌స్తాయి. అలాంటి మ‌ధురానుభూతుల్లో మ‌హిళ‌ల‌కు గ‌ర్భం కూడా ఒకటి. గ‌ర్భం ధ‌రించిన‌ప్ప‌టి నుంచి శిశువుకు జ‌న్మ‌నిచ్చే వ‌ర‌కు త‌ల్లికి చెప్ప‌లేని అనుభూతి ఉంటుంది. పొట్టలో బేబీ కదలికలు, కడుపులో తన్నడం వంటి ఫీలింగ్స్ వివరించలేని మధుర క్షణాలుగా మిగిలిపోతాయి. మొదటిసారి బేబీ మూమెంట్స్ ఫీలవడాన్ని క్విక్కెనింగ్ అని పిలుస్తారు. తల్లి కడుపులో బిడ్డ తంతూ ఉన్నాడంటే మీ బిడ్డ ఆరోగ్యంగా ఉందని గుర్తించాలి. 

 

ఇలా తన్నడం వెనుక బిడ్డ ఆరోగ్య స్థితిని తెలియజేస్తుంది. కానీ, పిండం పెరిగిన తర్వాత కూడా తన్నడం లేదంటే డల్ గా ఉన్నాడని డాక్ట‌ర్లు చెబుతుంటారు. అయితే అస‌లు ఇలా పిల్లలు తల్లి కడుపులో ఎందుకు తంతారు..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. తల్లి కడుపులో ఉన్నప్పుడు కొన్ని వారాల తర్వాత తన్నడం చేస్తుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే తల్లి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు శబ్దాలు వినిపించడం వల్ల మ‌రియు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అది కడుపులో ఉన్న పిల్లలకు వినబడ‌డం వ‌ల్ల బిడ్డ త‌న్న‌డం జ‌రుగుతుంది.

 

అలాగే గ‌ర్భంతో ఉన్న మ‌హిళ ఎడమవైపు పడుకున్నప్పుడు కూడా ఎక్కువ‌గా తంతూ ఉంటాడు. దీనికి కారణం ఏంటంటే.. ఎడ‌మ‌వైపు ప‌డుకున్న‌ప్పుడు పిండానికి రక్తం ఎక్కువగా సరఫరా అవ్వడం వలన బిడ్డ యాక్టివ్ అయ్యి తంతూ ఉంటారు. ఇక తల్లి కడుపులో బిడ్డ సాధారణంగా 9 వారాల నుండి తన్నడం మొదలుపెడతాడు. కానీ, మొద‌టి సారి గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌ల‌కు బిడ్డ‌ తన్నుతున్న అనుభూతి 18వ వారం నుంచి 25 వారం మధ్యలో కలుగుతుంది. అదే రెండోసారి గర్భం దాల్చిన తల్లులు మాత్రం బిడ్డ తన్నుతున్న అనుభూతి 13వ వారంలోనే గమనిస్తారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: