దేశంలో అత్యంత పవిత్ర స్థలాల్లో ఒకటి పార్లమెంట్. దేశ భవిష్యత్తుని నిర్దేశించే స్థలం పార్లమెంట్. పార్లమెంట్ లో చేసే చట్టాలు... దేశంలో ఉన్న ప్రతీ పౌరుడి తల రాతను నిర్దేశిస్తాయి. అలాంటి పార్లమెంట్ ని కాపాడింది ఒక మహిళ. తన ప్రాణం పోయినా సరే పార్లమెంట్ పై జరుగుతున్న భీకర దాడిని అడ్డుకుంది. ఆమె ఎవరో కాదు కమలేశ్ కుమారి యాదవ్. 2001 లో జరిగిన పార్లమెంట్ పై దాడిలో ఆమె ధైర్య సాహసాలే పార్లమెంట్ ని కాపాడాయి. కానిస్టేబుల్ కమలేష్ కుమారి యాదవ్ 1994 లో సిపిఆర్ఎఫ్‌లో చేరారు మరియు మొదట అలహాబాద్‌లోని ఎలైట్ 104 రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఐఎఫ్) తో ఆమెకు పోస్టింగ్ వచ్చింది. 

 

వెంటనే, ఆమెను 12 జూలై 2001 న 88 మహిళా (ఉమెన్స్) బెటాలియన్‌లో నియమించారు. కుమారి ఈ బృందం పార్లమెంట్ భద్రతా విధుల్లో ఉంది. కమలేష్ కుమారి యాదవ్ పార్లమెంట్ హౌస్, బిల్డింగ్ గేట్ నెంబర్ 11 పక్కన ఉన్న ఐరన్ గేట్ నంబర్ 1 వద్ద నియమించారు. లైసెన్స్ ప్లేట్ నంబర్ DL 3C J 1527 ను కలిగి ఉన్న ఒక అంబాసిడర్ బ్రాండ్ కారు విజయ్ చౌక్ నుండి గేట్ వైపు వస్తుంది. ఆ కారుని గమనించిన యాదవ్... ఏదో జరుగుతుంది అని గామించి ఆమె గేట్ మూసి వేయడానికి పోస్ట్ వద్దకు తిరిగి పరిగెత్తారు. 

 

కుమారి ప్రతిఘటించడంతో కారు ముందుకి వెళ్ళలేకపోయింది. దీనితో ఉగ్రవాదులు ఆమెపై దాడికి దిగారు. ఈ దాడి ఘటనలో కమలేష్ యాదవ్ కడుపులో పదకొండు బుల్లెట్లు దిగాయి. ఉదయం 11:50 గంటలకు ఈ దాడి జరిగింది. కమలేష్ కుమారి యాదవ్ అప్రమత్తత ఉగ్రవాదుల దాడి అడ్డుకుంది. ఉగ్రవాదుల ఆత్మాహుతి దళాన్ని నిరోధించింది ఆమె తన ధైర్యంతో. గేట్ నంబర్ 1 మూసివేయడం మరియు అలారం మోగించడంతో ఇతర భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. దీనితో ఉగ్రవాదులను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఆ దాడిలో ఆమె ప్రాణాలు కోల్పోగా 2003 లో ఆమెకు అశోక చక్ర ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: