కొన్ని కొన్ని సార్లు చెడు కూడా మంచి జరుగుతుంటుంది.. వారి జీవితాలు నాశనం అయినా పక్కవారి జీవితాలకు అదే వెలుగు బాట అవుతుంది. అలాంటి ఘటనే జరిగింది ఇక్కడ కూడా. అప్పుల బాధతో 19 ఏళ్ళ ఆమెకు 45 ఏళ్ళ వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేసింది ఆమె తల్లి.. అతను ప్రతిరోజు ఆస్పత్రికి వెళ్లాల్సిందే.. బతికి ఉన్న ఏడేళ్లు ఆమెను ఇంట్లో పెట్టి తాళం వేసి నరకం చూపించాడు. 

 

ఈ ఘటన తమిళనాడులో జరిగింది.. బలవంతపు పెళ్లి చేసుకున్న యువతీ తమిళనాడులోని కోయంబత్తూరులో పుట్టిపెరిగింది. ఆమె పేరు ఉమా. పుట్టినప్పటి నుండి ఎన్నో కష్టాలు పడి పెరిగిన ఆమె తల్లి స్వార్ధానికి బలై 45ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఆ బలవంతపు పెళ్లే ఎందరో జీవితాలకు వెలుగునిచ్చింది. ఎంతోమంది జీవితాలను ఆమె మార్చేసింది. 

 

IHG

 

అయితే ఆమెకు పెళ్లి జరిగిన 7 ఏళ్లకు ఆమె భర్త చనిపోయాడు.. అయితే ఆమె భర్త వైద్యం కోసం తరచూ ఆస్పత్రికి వెళ్లేవారు. అలా ఆస్పత్రికి వెళ్లిన సమయంలోనే చాలామంది సరైన వైద్యం పొందలేకపోతున్నారు అనేది ఆమె గమనించారు. అది గమనించిన ఆమె పేదరికంతో పాటు ఏ జబ్బుకు ఎలాంటి వైద్యం చేయించుకోవాలి? దానికి ఎక్కడ సరైన వైద్యం దొరుకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న కనీస అవగాహనా లేని వారికీ ఎలా అయినా సరే సహాయం చెయ్యాలి అని ఆమె నిర్ణయించుకుంది. 

 

IHG

 

దరఖాస్తు ఫర్మ్ లు నింపి ఏ జబ్బుకు ఎలాంటి చికిత్స చేయించుకోవాలి? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లాలి? లాంటి విషయాలు లాంటి విషయాలు అక్కడ రోగులకు చెప్పేది.. అయితే ఆమె సహాయం చేస్తుంది అని తెలుసుకున్న ఎంతో మంది ఆమెను సంప్రదించడం చేశారు. ఆ స్పందన చుసిన ఆమె శాంతీ మెడికల్ ఇన్‌ఫర్మేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. 

 

IHG

 

సరైన వైద్యం చేయించుకోలేని వేలాదిమందికి ఆమె సహాయం చేసింది. అంతేకాదు.. ఏ జబ్బుకు ఎక్కడ సరైన వైద్యసదుపాయాలు అందుబాటులో ఉన్నాయి ఏ ఆస్పత్రిలో తక్కువ ఖర్చుకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి అని తెలుసుకోడానికి ఆమె దేశం అంత తిరిగారు. అన్ని తెలుసుకున్నారు. 

 

IHG

ఆతర్వాత కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ఎంతోమంది సహాయం చేసేందుకు శాంతి సెంటర్ స్థాపించారు. మొట్టమొదటి డయాలసిస్ కేంద్రం కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆమెకు భారతదేశం అంతటా 20కిపైగా కేంద్రాలు ఉన్నాయి. దీనికోసం చాలా మంది విరాళాలు ఇచ్చారు. 

 

IHG

 

కిడ్నీ సంబంధిత జబ్బుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేశారు.. మొదట ఆమె కిడ్నీ దానం చెయ్యాలి అని ఎంతమందిని అడిగిన ఒప్పుకునేవారు కాదు.. దీంతో మూత్రపిండాలు విఫలమైన ఓ అనాథకు ఆమె తన కిడ్నీని ఇచ్చారు. ఇప్పుడు అతను ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నాడు. ఇలా ఆమెకు బలవంతంగా పెళ్లి చేసిన.. ఆమెను పెళ్లి చేసుకున్న భర్త అర్ధాంతరంగా మరణించిన ఆమె ఎందరి జీవితాల్లోనో వెలుగునిచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: