ఎందరో మహిళలు.. ఎన్నో కష్టాలు.. అన్ని అనుభవించి ఎందరో నిస్సహాయులకు స్ఫూర్తిగా నిలుస్తారు. అలా నిలిచినా వారిలో రష్యాకు చెందిన IHG అనే మహిళా ఒకరు. ఒకానొక సమయంలో చావు అంచుల వరుకు వెళ్లిన ఆమె ఇప్పడు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రజలకు పరిచయం అయ్యి ఓ స్టార్ గా మారింది.. 

 

ఆమె కథ ఏంటి అంటే? ఆమెకు నాలుగేళ్లు ఉన్నప్పుడు అగ్ని ప్రమాదం జరిగి ఆమె శరీరం కాలిపోయింది.. ఎన్నో నెలలు పాటు కోమాలో ఉంది.. కోలుకున్నాక నడవడమ్.. మాట్లాడటం మల్లి నేర్చుకుంది. స్కూల్ కి వెళ్తే మిగితా పిల్లలు ఆమెను వెక్కిరించి ఏడిపించేవారు. అందుకే ఆమె స్కూల్ కు వెళ్ళటం మానేసింది. 

 

IHG

 

దగ్గరకు తీసుకొని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లి చీదరించుకునేది. తండ్రి చనిపోగానే తల్లి మద్యానికి బానిసైంది. దీంతో ఉన్న డబ్బు అంత కరిగిపోయింది. ఇంకా ఆమెను అనాథాశ్రమంలో చేర్చారు. ఇంకా ఆమెకు ఎవరు లేరు అని అనుకోని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది కానీ పక్కవారు సహాయం చేశారు. ఆరు నెల్ల తర్వాత మల్లి ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నిచింది. 

 

కానీ రెండోసారి కూడా ఆమె ప్రాణాలతో బయటపడింది. ఇలా ఆమె ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకున్న ప్రాణాలతో బయటపడటంతో ఆమె సానుకూల దృక్పథంతో బతకాలి అని నిర్ణయించుకుంది.  

 

దీంతో అనాథాశ్రమం నుండి మాస్కోకు పారిపోయి అక్కడ జీవితం ప్రారంభించింది. అక్కడ ఆమెకు జీవితం కొత్తగా కనిపించింది.. అక్కడ జనాలు అంత ఆమెను కన్నార్పకుండా చూడటం ఆమె గమనించారు. దీంతో ఆమె జీవితం ఎందరికో స్ఫూర్తిని ఇవ్వాలి అని.. ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజీ మొదలు పెట్టి అందులో ఆమెకు అయినా గాయాల ఫొటోలు పోస్ట్ చేస్తూ జీవితం గురించి రాయడం ప్రారంభించింది. 

 

దీంతో ఆ పోస్టులకు అనుహ్యమైన స్పందన వచ్చింది. ఎందరికో ఆ పోస్టులు స్ఫూర్తినిచ్చాయి. చాలామంది ఆ ఫోటోలు.. పోస్టులు చూసి తమపై సానుకూల ప్రభావం చూపుతోందని స్పందించారు. దీంతో ఆమె మరింతమందికి తెలియాలని ఆమె ఎంత ఎక్కువమందికి తెలిస్తే, అంత ఎక్కువ ఆశ, ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని తీసుకురాగలదు అని.. అసాధ్యురాలు, మంచి మనసున్న మనిషి, ఉద్యమకారిణి... అన్నీ కలిపితే ఆమె అని IHG చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా.. ఈ కాలంలో మహిళా అందంగా లేదు అంటే చాలు ఎన్నో కామెంట్లు.. ఎన్నో చిల్లర వేషాలు వేస్తారు.. కానీ చూడాల్సింది అందం కాదు మనసును అనేది చాలామంది తెలుసుకోలేరు. అది తెలుసుకున్న రోజు ఒక్క ఈమె జీవితమే కాదు ఎందరో జీవితాలు అద్భుతంగా ఉంటాయి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: