ఇది 2020 కాలం. ఇప్పటికి మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి ఆడవారిపై వివక్ష చూపుతూనే ఉన్నారు. చిన్నప్పటి నుండే.. నువ్వు అమ్మాయివి ఇలానే ఉండాలి అని చెప్పే పెద్దలు ఇంకా ఉండనే ఉన్నారు. అలాంటి మాటలు పోయి.. ఆడపిల్లలు, మగపిల్లలు ఇద్దరు సమానం అనుకునే రోజులు మన భారత్ రావలి అంటే ఎంత కాదు అన్న ఇంకో మూడు నాలుగు శతాబ్దాలు పడుతుంది. 

 

అవును అండి.. నిజమే.. నేటితరం మహిళలు ఆకాశాన్ని తాకుతున్నారు.. రాజ్యాన్ని ఏలుతున్నారు. కానీ ఇప్పటికి మహిళలు అంటే చిన్న చూపే ఉంది. అటువంటి ఈ సమాయంలో కూడా కొన్ని ప్రాంతాలలో అమ్మాయిలను బయటకు పంపి ఉద్యోగం చేయించాలి అంటే ఆలోచించే రోజులు ఇవి. 

 

మహిళ సినీ తార అవుత అంటే ఒప్పుకుంటారు.. ఓ మహిళ కలెక్టర్ అవుత అంటే ఒప్పుకుంటారు.. ఓ మహిళ గవర్నమెంట్ ఉద్యోగి అవుత అంటే ఒప్పుకుంటారు.. కానీ ఓ మహిళ రాజకీనాయకురాలు అవుత.. రాజ్యాన్ని ఏలుతా అంటే మాత్రం మొదట ఇంటి నుండే అణగదొక్కడం మొదలవుతుంది.. ఈ కాలంలోనే అలా ఉంటే.. స్వతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో ఇంకెంత ఉండాలి? 

 

అలాంటి రోజుల్లోనే ఒక మహిళ ప్రధానమంత్రి అయ్యింది అంటే ఎంత గొప్ప విషయం. భారతదేశంలో మహిళలు ఇప్పటికే ఎక్కడో ఒకచోట ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నారు. అలా కనిపించినవారిలో ప్రధానమంత్రిగా ఇప్పటి వరుకు ఒకేఒక మహిళ ఇందిరా గాంధీ.. ఆ తర్వాత ఎందరో దరిద్రపు పురుషులపై దండయాత్ర చేసినట్టు సొంతపార్టీ పెట్టి గెలిచిన మహిళ జయలలిత. 

 

ఇందిరా గాంధీ దేశాన్ని ఓ రేంజ్ లో పరిపాలించి ఎందరికో స్ఫూర్తినిచ్చారు. ఎందరో జీవితాలను మార్చారు. భారత్ ను శత్రు దేశాలకు వెళ్లకుండా అప్పట్లో కాపాడారు.. రాజకీయాలలో మొట్టమొదటి రాణి ఇందిర గాంధీనే. భారత్ ను ఇందిరా గాంధీ ఏకంగా 14 ఏళ్ళు పాలించారు అంటే ఆమె రాజకీయాలలో ఎంత పండిపోయారో అర్ధం చేసుకోండి. 

 

ఇంకా ఆమె తర్వాత అంతటి రాజకీయ సమర్ధురాలు ఎవరైనా ఉన్నారు అంటే.. అది ఖచ్చితంగా జయలలితనే.. మగాళ్ల బుద్దిని అతి దగ్గరగా చుసిన ఆమె వారిని అణగతొక్కి వారిపై విజయం సాధించింది. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడి ఇష్టం లేకపోయినా సినిమాలలోకి వచ్చి అక్కడ ఎందరో మగవాళ్ల చేతిలో మోసపోయి అవమానాలు పడి లేచిన శక్తి.. రాజకీయ వ్యూహాలకు రాణి జయలలిత. తమిళనాడు ప్రజలు మనసు దోచి ఎన్నో సార్లు ముఖ్యమంత్రి అయినా మహిళామణి జయలలిత. అప్పట్లో.. ఇప్పట్లో.. ఎప్పట్లో ఇలాంటి రాజీకీయనాయకురాళ్లను మనం చూడలేం. 

మరింత సమాచారం తెలుసుకోండి: