ఇప్పటికీ.. ఎప్పటికీ.. ఆ సినీ తారే నేటి ఆడవాళ్లందరికీ ఆదర్శం. నేటితరం సినీతారలకు ఆదర్శ మహిళ ఆమే. ఎందుకు అని సందేహం రావచ్చు.. అప్పట్లోనే ఆమె ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. ఇప్పుడు సినీ తారలకు నటన ఉంటే గ్లామర్ ఉండదు... గ్లామర్ ఉంటే నటన ఉండదు.. గ్లామర్ షో చెయ్యనిదే స్టార్ కూడా అవ్వలేని పరిస్థితి. 
 


ప్రస్తుతం నటించేవారు స్టార్ హీరోయిన్స్ అయినా రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయితే హీరోయిన్ గా కెరీర్ ముగిసినట్లే. కొందరు గ్లామర్ షో చేసి అవకాశాలు తెచ్చుకున్నా ఒకటీ రెండు సినిమాల తరువాత అవకాశాలు లేక కనుమరుగవుతున్నారు. అప్పట్లో ఆ సినీ తార.. గ్లామర్.. నటన అన్ని రకాల కళలు చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాంటి అద్భుతమైన మహిళ ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు మహానటి సావిత్రి. 
 


అందానికి అందం.. నటనకు నటన... మంచితనానికి మంచితనం... గౌరవానికి గౌరవం ఇలా అన్నీ ఉన్నా అణిగిమణిగి ఉన్న నటి సావిత్రి. ఎంత ఎదిగినా ప్రతిఒక్కరికీ గౌరవం ఇచ్చిన అద్భుత నటి. చివరి వరకు ఆమె తన జీవితాన్ని నటనకే అంకితం చేసింది. భర్తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి మోసపోయిన ఆమె మళ్లీ నటన రంగంలో అడుగుపెట్టినా అప్పటికే ఆమె ఆస్తులు అన్నీ కరిగిపోయాయి. 
 


నిజానికి ఆమె జీవితం ఆదర్శం.. సినీ ఇండస్ట్రీలో ఎలా ఉండాలి అనేదానికి ఆమె ఒక నిదర్శనం. ఆమె నటన చూస్తే అలా నటించాలి .. ఆమె మనస్తత్వంలా మనది ఉండాలి అనిపిస్తుంది. ఆమె వైవాహిక జీవితం చూస్తే ఆమెలా బ్రతకకూడదు అని అనిపిస్తుంది. ఇలా ఆమె అన్నిరకాలుగా సినీ తారలకు ఆదర్శ మహిళగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: