పాస్తా.. చూస్తే ఆబ్బె అనిపిస్తుంది.. తింటే ఆహా అనిపిస్తుంది. అంత అద్భుతమైన ఈ పాస్తాను తిన్న వారు మళ్లీ ఎప్పుడు ఎప్పుడు తినాలి అని ఎదురుచూస్తుంటారు. అంత అద్భుతంగా ఉంటుంది ఆ పాస్తా. ఇక అలాంటి పాస్తాను ఎలా చెయ్యాలో తెలుసా? ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావాల్సిన పదార్ధాలు.. 

 

ఆలివ్ నూనె - 2 టేబుల్ స్పూన్లు,

 

ఉల్లిపాయ తరుగు - అర కప్పు,

 

వెల్లుల్లి, లవంగాల పేస్ట్ - ఒక టీ స్పూన్,

 

జీలకర్ర పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు,

 

టమోటా పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్,

 

టమోటా తరుగు - రెండు కప్పులు,

 

స్పాగెట్టీ - మూడు కప్పులు,

 

క్యారట్ తరుగు - అర కప్పు,

 

ఫెటా తరుగు - ఒక కప్పు,

 

ఆకుకూర కాడల తరుగు - అర కప్పు

 

తయారీ విధానం...

 

స్టవ్ మీద ఫ్యాన్ పెట్టి మీడియం మంటపై ఆలివ్ నూనె వేసి వేడి చేయాలి. దానిలో ఉల్లిపాయ, క్యారట్, ఆకుకూరల కాడలు వేసి కలుపుతూ తక్కువ వేడిలో మెత్తగా అయ్యేవరకు 5 నిముషాలు ఉంచాలి. తర్వాత వెల్లుల్లి లవంగాల పేస్ట్, జీలకర్ర, టమోటా పేస్ట్, టమోటా ముక్కలు అర కప్పు నీరు చేర్చి.. కొంచెం మరిగాక ఉప్పు, మిరియాలు వేయాలి. ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ఆతర్వాత స్పాగెట్టీ‌ని సాస్‌కు జోడించండి. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని పాస్తాను సర్వ్ చేసుకోండి. అంతే పాస్తా రెసిపీ రెడీ. ఇంకేందుకు ఆలస్యం పాస్తాను ఇంట్లోనే చేసుకొని అద్భుతమైన రుచిని ఆస్వాదించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: