మష్రూమ్స్‌.. శాకాహారులకు ఇదే మాంసం. ఎందుకంటే ఈ మష్రూమ్స్‌ మాంసం కంటే రుచిగా ఉంటాయి. అందుకే ఈ మష్రూమ్స్‌ ను ఎన్నో రకాలుగా వండుకొని తింటుంటారు. మష్రూమ్స్‌ బిర్యానీ అని, ఫ్రై అని, కూరా అని, ఫ్రైడ్ రైస్ అని ఇలా ఎన్నో రకాల మష్రూమ్స్‌ రెసిపీని చేసుకొని తింటుంటారు. అయితే ఇప్పుడు మష్రూమ్స్‌ బటర్‌ మసాలాని చేసుకొని తినండి..  

 

కావాల్సిన పదార్థలు... 


 
బటన్‌ మష్రూమ్స్‌ - 200 గ్రా.,

 

దాల్చినచెక్క- అంగుళంముక్క,

 

 లవంగాలు- మూడు,


 
యాలకులు- నాలుగు,

 

ఉల్లిపాయలు- మూడు,

 

ఉప్పు- తగినంత, 

 

అల్లంవెల్లుల్లి- 2 టీస్పూన్లు, 

 

టొమాటో- ఒకటి, 

 

కారం- టేబుల్‌స్పూను,

 

పసుపు- టీస్పూను, 

 

కసూరిమెంతి- 2 టీస్పూన్లు, 

 

ఉప్పు- తగినంత, 

 

జీడిపప్పు ముద్ద- 3 టేబుల్‌ స్పూన్లు,

 

తాజా క్రీమ్‌- పావుకప్పు, 

 

వెన్న- టేబుల్‌ స్పూను, 

 

నూనె- 3 టేబుల్‌ స్పూన్లు.

 

తయారీ విధానం... 

 

పుట్టగొడుగుల్ని సగానికి కోసి పక్కన పెట్టాలి. అలాగే ఉల్లిపాయలు, టమాటాలు ముక్కలుగా కోయాలి. జీడిపప్పులో తగినన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి. బాణలిలో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి కాగాక దాల్చిన చెక్క ముక్కలు, లవంగాలు, యాలకులు వేసి అర‌¹నిమిషం వేయించాలి. తర‌వాత ఉల్లిముక్కలు, ఉప్పు వేసి వేగాక, అల్లం వెల్లుల్లి వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత టొమాటో ముక్కలు, పసుపు, కారం, కసూరి మెంతి వేసి వేయించి దించాలి. చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. కొద్దిగా నీళ్లు కూడా జోడించాలి. నాన్‌స్టిక్‌ పాన్‌లో మిగిలిన నూనె వేసి కాగాక పుట్టగొడుగుల ముక్కలు, ఉప్పు వేసి ఉడికించాలి. అందులోని నీళ్లన్నీ ఆవిరైపోయాక రుబ్బిన మసాలా ముద్ద, అర కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత జీడిపప్పు ముద్ద వేసి సిమ్‌లో మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరగా తాజా మీగడ, వెన్న వేసి బాగా కలిపి దించాలి. అంతే టేస్టీ టేస్టీ మసాలా మష్రూమ్స్ కర్రీ రెడీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: