కావాల్సిన ప‌దార్థాలు:
అర‌టి దూట తరుగు- ఒకటిన్నర కప్పులు
పచ్చికొబ్బరి తురుము - ఒక‌ టీ స్పూను
అల్లం తరుగు- అర టేబుల్‌ స్పూను

 

పెరుగు- అర‌ కప్పు
ఆవాలు- అర టీ స్పూను
ఇంగువ- పావు టీ స్పూను

 

కరివేపాకు- నాలుగు రెబ్బలు
పచ్చిమిర్చి- మూడు
నూనె- త‌గినంత‌
ఉప్పు- రుచికి స‌రిప‌డా

 

తయారీ విధానం: 
ముందుగా పొరలన్నీ వలిచేసిన దూటను చక్రాల్లా తరిగి, పీచుని తీసి సన్నముక్కలుగా క‌ట్ చేసుకోవాలి. ఇప్పుడు త‌రిగి పెట్టుకున్న ముక్క‌ల‌ని నీటిలో సరిగ్గా ఐదు నిమిషాలు ఉడికించి వార్చేయాలి. ఇప్పుడు కొబ్బరి తురుము, అల్లం, పచ్చిమిర్చి కలిపి పేస్టు చేసుకోవాలి.  

 

త‌ర్వాత ఒక పాత్రలో అర‌టి దూట తరుగు, కొబ్బరి పేస్టు, పెరుగు, ఉప్పు వేసి బాగా కలిపి విడిగా తాలింపు పెట్టుకుంటే స‌రిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ అరటి దూట పచ్చడి రెడీ. ఎక్కువ ప్రొటీన్లు కలిగిన ఈ పచ్చడి వారంలో ఒకసారైనా చేసుకుని తింటే చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: