సాధార‌ణంగా తల్లిగా మారే దశలో ప్రతీ స్త్రీ మధురమైన అనుభూతులకు లోనవుతుంటుంది. అలాగే మహిళలు మామూలు సమయాల్లో కంటే గర్భ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. గర్భంతో ఉన్నప్పుడు కాల్షియం, ప్రోటీన్లతో కూడిన ఆహారం ఉండాలి. అప్పుడే శిశువు ఎముకలు, కణజాలాలు బాగా వృధ్ధి చెందుతాయి. మ‌రియు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాలు తీసుకోవాలి. అయితే ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో అనేక ప్ర‌శ్న‌లు మైండ్‌లో వెంటాడుతూ ఉంటాయి. అందులో ప్రెగ్నెన్సీ సమయంలో ప్రయాణం చేయవచ్చా..? చేయడం వ‌ల్ల ఏం జ‌రుగుతుంది..? అన్న‌వి కూడా ఉంటాయి.

 

అయితే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రయాణం అంటే కాబోయే తల్లికి ఓకింత ఆందోళనగానే ఉంటుంది. ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో ప్రాయాణాలు చేయవచ్చు కానీ.. ప్రయాణంలో మీకు అలసట, విసుగు రావచ్చు. అంతేకాక, ఒక్కోసారి ప్రెగ్నెన్సీ మిస్‌క్యారేజ్ అవ్వవచ్చు. ఇక రెండు, మూడు త్రైమాసికంలో మీరు సులభంగా ట్రావెల్ చేయవచ్చు. అయితే మీరు పూర్తి ఆరోగ్యంగా ఉండి, మీ డాక్టర్ కూడా ఓకే అంటేనే వెళ్ళడం ఇంకా మంచిది. మీరు వెల్తున్న వాహనం పూర్తి అనుకూలంగా, సౌలభ్యంగా ఉండేలా చూసుకోవాలి.

 

అలాగే మీ మెడికల్‌కు సంబంధించి అన్ని రిపోర్ట్స్ మీతో ఉంచుకోవడం మంచిది. దీంతో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో డాక్టర్‌కు పని సులువవుతుంది. మ‌రియు కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో ప్ర‌యాణాలు చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది. తలనొప్పిగా ఉన్నా, కడుపులో ఎటువంటి అసౌకర్యం కల్గినా ప్ర‌యాణాలు చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది. ఎందుకంటే, అలాంటి స‌మ‌యంలో ప్ర‌యాణం మీకు మ‌రింత అసౌక‌ర్యాన్ని క‌లిగిస్తుంది. సో.. బీకేర్‌ఫుల్‌..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: