చింత చిగురు ఈ కాలంలోనే చిగురిస్తుంది.. చింతకాయే కాదు చింత చిగురు కూడా పుల్లగా అద్భుతంగా ఉంటుంది. నిజానికి చింత చిగురు సిటీస్ లో దొరకదు.. పల్లెల్లో మాత్రమే దొరుకుతుంది.. పల్లెలకు దగ్గరగా ఉన్న టౌన్ లలో అప్పుడప్పుడు ఈ చింతచిగురు కనిపిస్తుంటుంది. అలాంటి చింత చిగురు కనిపిస్తే పుల్లపుల్లగా ఉండే చింతచిగురు వంకాయ కర్రీ చేసుకొని తినండి.. రుచిని ఆస్వాదించండి. అయితే చింతచిగురు వంకాయ ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావాల్సిన పదార్ధాలు... 

 

వంకాయలు - అరకేజీ, 

 

చింతచిగురు - ఒకటింబావు కప్పు, 

 

ఉల్లిపాయ ముక్కలు - కప్పు, 

 

నూనె - పావుకప్పు, 

 

పసుపు - చెంచా, 

 

ఉప్పు - తగినంత, 

 

పచ్చిమిర్చి - ఐదు, 

 

ఎండుకొబ్బరిపొడి - 2 టేబుల్‌ స్పూన్లు, 

 

ధనియాలపొడి - చెంచా, 

 

జీలకర్ర - చెంచా, 

 

సెనగపప్పు - చెంచా, 

 

ఆవాలు - చెంచా, 

 

కూరకారం - అరచెంచా.

 

తయారీ విధానం... 

 

ముందుగా వంకాయల్ని ముక్కల్లా తరిగి పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో నూనె వేడి చేసి జీలకర్రా, ఆవాలూ, సెనగ పప్పును వేయించుకోవాలి. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసేయాలి. తర్వాత వంకాయ ముక్కలూ, పసుపూ వేసి మూత పెట్టాలి.. కాసేపటికి ఆ వంకాయ ముక్కలు బాగా మగ్గుతాయి. అప్పుడు కడిగిన చింత చిగురూ, పచ్చి మిర్చి వేసి బాగా కలపాలి. చింతచిగురు మగ్గి, వంకాయ ముక్కలు వేగాక తగినంత ఉప్పు, కొబ్బరిపొడి, ధనియాలపొడి, కూరకారం వేసి బాగా కలపాలి. అంతే పుల్లపుల్లగా చింత చిగురు వంకాయ కర్రీ రెడీ.. 

మరింత సమాచారం తెలుసుకోండి: