ఆమె ఓ మాజీ నటి.. ఆ తర్వాత ముకేశ్ అంబానీ భార్య.. అంటే ఈ భారత దేశంలోనే అత్యంత ధనవంతుడికి భార్య. ఇప్పుడు ఆమె ఓ సంచలన రికార్డు సాధించారు. ఈ దేశంలోని అత్యంత ప్రభావిత మహిళల జాబితాలో చోటు సంపాదించారు. అలాగని ఆమె ఏ బిజినెస్ రంగంలోనో ఈ ఖ్యాతి దక్కించుకోలేదు సుమా.

 

 

ఆమెకు ఈ ఖ్యాతి క్రీడారంగం నుంచి వచ్చింది. ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ లో విజయవంతమైన జట్టు. ఆమె ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియన్స్ కు యజమాని అన్న విషయం తెలుసుకదా.. తమ జట్టు గెలిచినా, ఓడినా ఆటగాళ్లను మాత్రం నీతా ఒకే విధంగా గౌరవిస్తారు. ఈ టీమ్ ఇంతగా సక్సస్ కావడానికి యజమానిగా నీతా అంబానీ కెపాసిటీ కూడా ఓ కారణమే.

 

 

ఐపీఎల్ తో జైత్ర యాత్ర ప్రారంభించిన నీతా అంబాన్ని ఇప్పుడు ఫుట్ బాల్ లీగ్ లోనూ తన సత్తా ఏంటో చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆమె క్రీడల్లో అత్యంత ప్రభావశీల మహిళల జాబితాలో స్థానం దక్కించుకున్నారు. ఈ అవార్డును ఐ స్పోర్ట్స్ కనెక్ట్, స్పోర్ట్స్ బిజినెస్ నెట్ వర్క్ సంయుక్తంగా ఇస్తాయి. ఈ జాబితా టాప్ 10 లో నీతా కు స్థానం దక్కింది. నీతాతో పాటు సెరెనా విలియమ్స్, నవోమీ ఒసాకా, స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ వంటి వారు ఈ లిస్టులో ఉన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: