చింత చిగురు ఈ కాలంలోనే చిగురిస్తుంది.. చింతకాయే కాదు చింత చిగురు కూడా పుల్లగా అద్భుతంగా ఉంటుంది. నిజానికి చింత చిగురు సిటీస్ లో దొరకదు.. పల్లెల్లో మాత్రమే దొరుకుతుంది.. పల్లెలకు దగ్గరగా ఉన్న టౌన్ లలో అప్పుడప్పుడు ఈ చింతచిగురు కనిపిస్తుంటుంది. అలాంటి చింత చిగురు కనిపిస్తే పుల్లపుల్లగా ఉండే చింతచిగురు బంగాళాదుంపను చేసుకొని తినేయండి. ఎంతో రుచికరమైన ఈ కూరను ఎలా చేసుకోవాలి అని ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావాల్సిన పదార్ధాలు.. 

 

బంగాళాదుంపలు - నాలుగు, 

 

చింతచిగురు - 2 కప్పులు,

 

ఉప్పు - 2 టీస్పూన్లు, 

 

పచ్చిమిర్చి - ఐదు,

 

జీలకర్ర - టీస్పూను, 

 

అల్లం వెల్లుల్లిముద్ద - 2 టీస్పూన్లు, 

 

మినప్పుప్పు - 2 టీస్పూన్లు, 

 

సెనగపప్పు - 2 టీస్పూన్లు, 

 

నువ్వుల పొడి - అరకప్పు, 

 

నెయ్యి - 2 టీస్పూన్లు

 

తయారీ విధానం... 

 

ఉడికించిన బంగాళాదుంపలు తొక్కు తీసి బాగా మెదపాలి, చింత చిగురుని ఆవిరిమీద ఉడికించాలి. పాన్ లో నెయ్యి వేసి పోపు వేసి వేయించాలి. తరవాత ఉడికించి మెదిపిన బంగాళాదుంపలు, చింతచిగురు వేసి వేయించాలి. చివరగా నువ్వుల పొడి చల్లి మళ్లీ ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. అంతే చింతచిగురు బంగాళాదుంప రెడీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: