ప్రతి సంవత్సరం మహిళా జర్నలిస్టులకు ఇచ్చే ప్రతిష్టాత్మకమైన చమేలిదేవి జైన్ అవార్డులకు 2019 సంవత్సరానికి గాను అర్ఫాఖానుం షెర్వాని, రోహిణి మోహన్ ఎంపికయ్యారు. ప్రస్తుతం అర్ఫా ది వైర్ సీనియర్ ఎడిటర్ గా విధులు నిర్వహిస్తుండగా రోహిణి మోహన్ ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ గా పని చేస్తున్నారు. గత 38 సంవత్సరాలుగా అత్యుత్తమమైన మహిళా జర్నలిస్ట్ లకు ఈ పురస్కారాన్ని ఇస్తున్నారు. 
 
ఈ అవార్డుకు ఈ ఇద్దరిని మాత్రమే ఎంపిక చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అర్ఫా ఉత్తరప్రదేశ్, కశ్మీర్ లలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సమయంలో రిపోర్టింగ్ చేసినందుకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. రోహిణి ఎన్నార్సీపై అసోం రాష్ట్రంలో చేసిన పరిశోధనాత్మక జర్నలిజానికిగాను జ్యూరీ సభ్యులు ఈమెను ఎంపిక చేశారు. 1982లో తొలిసారి మహిళా జర్నలిస్ట్ లకు  చమేలిదేవి జైన్ అవార్డు ఇచ్చారు. 
 
పని ద్వారా వైవిధ్యం చూపిన మహిళా జర్నలిస్టులకు ఈ అవార్డులు ఇస్తారు. ఇంగ్లీష్, హిందీ, స్థానిక మాధ్యమాల ప్రతినిధులు ఈ అవార్డులకు ఎంపికవుతారు. ఇప్పటివరకూ 54 మంది మహిళలు చమేలిదేవి జైన్ అవార్డులకు ఎంపికయ్యారు. కరుణ, ధైర్యం, ఆవిష్కరణ, శైలి, సామాజిక ఆందోళన, విశ్లేషాణాత్మక నైపుణ్యం, శ్రేష్ఠత, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. మీడియా ఫౌండేషన్ 1980లో ఈ అవార్డును స్థాపించింది. ఈ అవార్డులను కేవలం మహిళా జర్నలిస్టులకు మాత్రమే ఇస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: