కావాల్సిన ప‌దార్థాలు:
మ‌ష్రుమ్స్‌- పావుకేజి
కొబ్బరి త‌రుము- కొద్దిగా
ఉప్పు- రుచికి స‌రిప‌డా

 

వెల్లుల్లి రెబ్బలు- మూడు
లవంగాలు- ఐదు
పచ్చిమిరపకాయలు- నాలుగు

 

ఉల్లిపాయ త‌రుగు- ఒక క‌ప్పు 
అల్లం- చిన్న ముక్క‌
యాలకులు- మూడు

 

మెంతులు- అర టీ స్పూన్‌
జీలకర్ర- అర టీ స్పూన్‌
కారం- ఒక టీ స్పూన్‌
కొత్తిమీర‌- కొద్దిగా

 

త‌యారీ విధానం: ముందుగా కొత్తిమీర, అల్లం, లవంగాలు, యాలకులు, వెల్లుల్లి, కొబ్బరి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో తగినంత నూనె వేసి వేడెక్కాక పచ్చిమిర్చి, ఉల్లి తరుగు, జీలకర్ర, కరివేపాకు వేసి బంగారు వర్ణంలోకి వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆ తరువాత ఉప్పు, పసుపు, శుభ్రం చేసిన మ‌ష్రుమ్ ముక్కలు, కొద్దిగా నీళ్లు పాన్‌లో వేసి కాసేపు ఉడికించాలి.

 

అలా ప‌ది నిమిషాలు మ‌గ్గిన త‌ర్వాత‌ మిక్సీలోని మసాలా వేసి కలియబెట్టాలి. మ‌ష్రుమ్ బాగా ఉడికాక‌..  కారం, స‌రిపోక‌పోతే కొద్దిగా ఉప్పు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. ఇక చివ‌రిగా కొత్తిమీర జ‌ల్లి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే ఎంతో రుచిక‌ర‌మైన మ‌ష్రుమ్ మ‌సాల కూర రెడీ. ఒక్క‌సారి దీన్ని తిన్నారంటే మ‌ళ్లీ మ‌ళ్లీ తినాల‌నిపిస్తుంది. కాబ‌ట్టి.. త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: