నిర్భ‌య దోషుల‌కు ఉరి ఖ‌రారైంది. అయితే నిర్భయ దోషులను ఈనెల 20న  ఉదయం 5.30 గంటలకు ఉరితీయాలంటూ డెత్‌ వారెంట్లు కూడా జారీ అయ్యాయి. కొద్ది రోజుల క్రితం నిర్భయ దోషులు పవన్‌ గుప్తా, ముఖేశ్‌ సింగ్‌, అక్షయ్‌ ఠాకూర్‌, వినయ్‌ శర్మ దాఖలు చేసిన వివిధ పిటిషన్లను ఢిల్లీ కోర్టు, ఢిల్లీ పటియాలా హౌజ్‌ కోర్టు కొట్టివేశాయి. ఇక చివ‌ర‌గా గురువారం ప‌టియాల కోర్టు పవన్‌ గుప్తా క్యూరేటివ్‌ పిటిషన్‌ను గురువారం కొట్టివేయ‌డంతో ఉరిశిక్ష‌కు అడ్డంకులు ఉండ‌బోవ‌ని తెలుస్తోంది. మరో కొన్ని గంటల్లో న‌లుగురు దోషుల‌కు  తీహార్‌ జైలులో ఉరిని అమ‌లు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే డమ్మీ ఉరి కూడా పూర్తైన విషయం తెలిసిందే.  అయితే దోషుల బంధువులు, కుటుంబ స‌భ్యులు ఉరిశిక్ష‌లు ఆపేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 


న్యాయ వ్య‌వ‌స్థ‌లోని కొన్ని లోపాల‌ను ఆధారంగా చేసుకుని ఉరి శిక్ష‌ణు వాయిదా వేయించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ‌రుస‌గా పిటిష‌న్లు దాఖ‌లు చేయ‌డం, రివ్యూ పిటిష‌న్ల‌తో త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పటియాలా హౌజ్‌ కోర్టు వద్ద గురువారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్న వేళ అక్షయ్‌ ఠాకూర్‌ భార్య పునీతా దేవి కోర్టు ప్రాంగణంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డను తన పక్కనే కూర్చోబెట్టుకున్న ఆమె... చెప్పులతో తన ప‌లుమార్లు కొట్టుకుంటూ ఈ దేశంలో మాకు న్యాయం జ‌ర‌గ‌డం లేదే అంటూ విల‌పించారు. అయాయ‌కుడైనా నా భ‌ర్త‌కు అన్యాయం జ‌రుగుతోందంటూ  బిగ్గరగా ఏడ్చింది. 

 

ఈ క్రమంలో ప‌లుమార్లు ఆమె  స్పృహ తప్పిపడిపోయింది. మెలకువ వచ్చిన తర్వాత మళ్లీ అదే విధంగా చేస్తూ... ‘‘ నాకు బతకాలని లేదు. శిక్ష అమలైతే నేను చచ్చిపోతా’’ అంటూ బెదిరింపులకు పాల్ప‌డింది. ఇదిలా ఉండ‌గా అక్షయ్ భార్య ఇదివరకే తనకు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ‘‘ నా భర్త అమాయకుడు. ఆయనను ఉరి తీసేముందు నాకు చట్టపరంగా విడాకులు కావాలి. ఎందుకంటే నేను అత్యాచార దోషి భార్యగా ఉండాలనుకోవడం లేదు’’ అని ఔరంగాబాద్‌ ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది. చివ‌ర‌గా కోర్టు ఆదేశాల అనంత‌రం నిందితుల త‌రుపు న్యాయ‌వాది
ఏపీసింగ్ మాట్లాడుతూ నిర్భ‌య దోషుల‌కు దేశ సేవ చేసే అవ‌కాశం క‌ల్పించాల‌ని కోర్టును కోర‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: