కావాల్సిన ప‌దార్థాలు:
ఆలుగడ్డలు- ఆరు
పనీర్‌ తురుము- ఒక కప్పు
పసుపు- చిటికెడు
నిమ్మరసం- అర టీ స్పూన్‌

 

ఉప్పు- రుచికి స‌రిప‌డా
ఎండుద్రాక్ష- ఎనిమిది
చాట్‌ మసాలా- ఒక‌ టీ స్పూన్‌
కారం- రెండు టీ స్పూన్లు

 

గరం మసాలా- ఒకటిన్నర టీ స్పూన్‌
పెరుగు- ఒక కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్‌- ఒక టీ స్పూన్‌
పచ్చిమిర్చి- మూడు
బాదం- ప‌ది

 

త‌యాదీ విధానం: ముందుగా ఆలుగడ్డలను అడ్డంగా కోసుకుని మధ్య భాగం తీసివేసి కప్పుల్లా చేసి నూనెలో వేగించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో ఒక టేబుల్‌ స్పూన్‌ నూనె పోసి వేడెక్కాక అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం పాటు వేగించాలి. తర్వాత బాదం, ఎండుద్రాక్ష, పనీర్‌, గరం మసాలా, కారం, చాట్‌ మసాలా, పసుపు, ఉప్పు, ముందుగా తీసిపెట్టుకున్న ఆలుగడ్డ గుజ్జువేయాలి.

 

దీన్ని మరో ఐదు నిమిషాలు వేగించి దింపేసి చల్లారిన తర్వాత పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వేయించుకున్న ఆలుగడ్డల్లో పెట్టి పెనం మీద నూనె వేసి కాల్చుకొని చివరగా నిమ్మరసం జ‌ల్లుకుంటే స‌రిపోతుంది. అంతే ఎంటో టేస్టీ టేస్టీ స్ట‌ఫ్డ్‌ ఆలూ రెడీ..!!


 

 

మరింత సమాచారం తెలుసుకోండి: