గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి వ‌స్తుంది. ఎందుకంటే..   తల్లి తీసుకొనే జాగ్రత్తలు బిడ్డకి ఎంతగానో మేలు చేస్తాయి. శరీర ధర్మపరంగా, పోషణపరంగా కూడా, గర్భంతో ఉన్న సమయం చాలా కీలకమైనది. నెలలు నిండుతున్న కొద్దీ, రోజువారీ చేసే పనులు, అంటే కూచోడం, నిల్చోడంలాంటివి కూడా అసౌకర్యంగా అన్పించవచ్చు. అలాగే గర్భధారణ సమయంలో సాధారణంగా మహిళలు ఎదుర్కునే సమస్యలలో  థైరాయిడ్ ఒకటి. మన శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్‌ ఒకటి. ఇది మన శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. 

 

ఈ గ్రంథి పనితీరు గతితప్పడం వలన హైపో థైరాయిడిజం, హైపర్‌ థైరాయిడిజం, గాయిటర్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి. గ‌ర్భ‌వ‌తికి థైరాయిడ్ వస్తే.. పుట్ట‌బోయే బిడ్డపై ప్ర‌భావం చూపుతుందా..? అన్న ప్ర‌శ్న చాలా మందికి ఉంటుంది. అయితే గర్భిణీలలో థైరాయిడ్ సమస్యను వెంటనే గుర్తించకపోతే అది పుట్టబోయే పిల్లలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గ‌ర్భధారణ సమయంలో మొదటి మూడు నెలలలో రక్తంలో థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా ఉండటం వలన గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. 

 

ప్రస్తుతం ఇటువంటి ఇబ్బందులు లేకుండా ముందే ఈ వ్యాధిని గుర్తించి, అందుకు తగ్గ నివారణ చర్యలు తీసుకుంటున్నారు. మ‌రియు మానసిక వైకల్యంతో పిల్లలు జన్మించడం, బుద్ధిమాన్యత లోపాలు ఉంటాయని కూడా చెబుతున్నారు వైద్య నిపుణులు. ఇక గర్భిణీలలో థైరాయిడ్ సమస్య కారణంగా  పిల్లలు ముందుగానే జన్మించడం లేదా కొన్నిసార్లు తక్కువ బరువుతో జన్మించడం కూడా జరుగుతుంటుంది. దీంతో పిల్ల‌ల‌కు ముందు ముందు అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్త‌వ‌చ్చు. కాబ‌ట్టి.. ముందుగానే థైరాయిడ్‌కు చెక్ పెట్టాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: