కావాల్సిన ప‌దార్థాలు:
బంగాళాదుంపలు- పావుకేజి
జీలకర్ర- పావు టీ స్పూన్‌
ప‌సుపు- చిటికెడు

 

కొత్తిమీర- ఒక‌ కట్ట
ఉప్పు- రుచికి తగినంత
పచ్చిమిర్చి- మూడు

 

టిక్కీల్లో కూరడానికి: 
ఉడికించిన పచ్చిబఠాణి- ఒక క‌ప్పు
పచ్చిమిర్చి- రెండు
అల్లం- చిన్న ముక్క‌
చాట్‌ మసాలా- అర టీ స్పూన్‌

 

తయారీ విధానం: ముందుగా బంగాళాదుంపల్ని మెత్తగా ఉడికించి, తొక్కతీసి మెదపాలి. ఇందులో ఉప్పు, ప‌సుపు, జీలకర్రలతో పాటు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా కలిపి ఆరు సమభాగాలుగా చేసుకోవాలి. 

 

బంగాళాదుంప గుజ్జులో కూరడానికి అల్లం, పచ్చిమిర్చిలను చిటికెడు ఇంగువతో పాటు వేగించి అందులో ఉడికించిన పచ్చిబఠాణి, ఉప్పు వేసి బాగా కలిపి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంతకొంత తీసుకొని బంగాళాదుంప గుజ్జు మధ్యలో కూరి గుండ్రంగా ఒత్తి నూనెలో దోరగా వేగించుకోవాలి. ఇప్పుడు చివ‌రిగా వాటిపై చాట్ మ‌సాలా జ‌ల్లుకుంటే స‌రిపోతుంది. అంతే ఎంతో రుచిక‌ర‌మైన ఆలూ టిక్కి రెడీ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: