ప్ర‌తి మ‌హిళ‌కు ప్రెగ్నెన్సీ అత్యంత ముఖ్యమైన స‌మ‌యం. అయితే మామూలు స‌మ‌యం కంటే ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఎక్కువ కేరింగ్ తీసుకోవాలి. ముఖ్యంగా ఫుడ్ విష‌యంలో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఆరోగ్య‌క‌ర‌మైన శిశువు కొర‌కు గర్భిణీ స్త్రీలు ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవాలి. అందులో కివి ఫ్రూట్స్ కూడా ఒక‌టి. కివీ..ఈ పండును వండర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు.దాదాపు 27 రకాల పండ్లలో లబించే పోషకాలు ఒక్క కివీ పండులో లభిస్తాయి అని చెప్పడంలో అతిశయోక్తి కాదు.

 

ప్రెగ్నన్సీ సమయంలో హార్మోన్లు అసమతుల్యంగా ఉంటాయి. ఒక సారి బాధగా వుంటారు, ఇంకొకసారి అంతులేని సంతోషంగా ఉంటారు. దీనికి కారణం హార్మోన్లు ఎక్కువ తక్కువ అవడం. కివి తినడం వలన ఈ సమస్య రాకుండా ఉంటుంది. గర్భిణీలు విటమిన్ సి ఆహారాలను తీసుకోవల్సినప్పుడు కివిఫ్రూట్స్ ను ఎంపిక చేసుకోవడం మంచిది . ఇది బేబీ డెవలప్మెంట్ కు కూడా సహాయపడుతుంది.  గర్భధారణ సమయంలో మలబద్దకం మరియు హెమరాయిడ్స్ చాలా సాధారణం.

 

అయితే గర్భధారణలో ఈ సమస్యను నివారించుకోవాలంటే కివిఫ్రూట్స్ ఒక బెస్ట్ ఫ్రూట్. కివి ఫ్రూట్ లో ఫోలేట్ చాలా అధికంగా ఉంటుంది. ఫోలేట్ కణాల నిర్మాణానికి చాలా అవసరమైన పోషకం. మీ ప్రెగ్నన్సీ సమయంలో దీనిని తీసుకోవడం వలన కడుపులోని బిడ్డ అవయువ నిర్మాణానికి కావాల్సిన ఫోలేట్ ను అందిస్తుంది. కివి ఫ్రూట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల హెర్బిటల్ అలర్జీలు మరియు గ్యాస్ట్రిక్, లేదా ఇతర జీర్ణ సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: