ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించేస్తోంది. అలాంటి వైరస్ ను తరిమికొట్టడం ప్రస్తుతం చాలా కష్టమైన పరిస్థితి. ఈ కరోనా వైరస్ కు విరుగుడు లేనందున ఎందరో మృతి చెందుతున్నారు. ఎందరో ఈ కరోనా బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ రాకుండా ఉండటానికి మిరియాల రసం తీసుకోవాలి అని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ మిరియాల రసం దగ్గు, జలుబు, జ్వరం వంటివి తరిమికొడుతుంది.. అలాంటి మిరియాల రసం ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావాల్సిన పదార్థాలు... 

 

ఒక గ్లాసు మంచినీరు, 

 

ఐదారు మిరియాల గింజలు, 

 

ఒక వెల్లుల్లి పాయ రెమ్మ, 

 

చితక్కొట్టిన అల్లం ముక్క, 

 

ఓ చిన్న బెల్లం ముక్క. 

 

తయారీ విధానం.. 

 

మిరియాల రసం ఎలా తయారు చెయ్యాలి అంటే? ఒక గ్లాసు మంచినీరు, ఐదారు మిరియాల గింజలు, ఒక వెల్లుల్లి పాయ రెమ్మ, చితక్కొట్టిన అల్లం ముక్క, ఓ చిన్న బెల్లం ముక్కలను కలిపి స్టవ్‌పై బాగా ఉడికించాలి. గ్లాసు నీరు అరగ్లాసు అయ్యేదాకా మరిగించి దించేసి వడగట్టుకుని, వేడి వేడిగా తాగాలి. ఈ రసాన్ని తాగడం వల్ల దగ్గు, జలుబు, గొంతునొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మంచి ఘాటు వాసనను కలిగి ఉండే మిరియాలతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ మిరియాల రసాన్ని ఇంట్లోనే చేసుకొని తాగండి.. ఆరోగ్యంగా ఉండండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: