బిడ్డ పుట్టాక బిడ్డతో పాటు గా తనను, తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత అవ‌స‌ర‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బిడ్డను చూస్కునే క్రమంలో సరైన ఆహారం తీసుకోవాలి. అలాగే శిశువు సంపూర్ణ ఆరోగ్యానికి తల్లిపాలే శ్రీరామరక్ష. బ్యాక్టీరియా, వైరస్‌, క్రిములు, ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఒక సంజీవనిలా పనిచేస్తాయి. అమ్మపాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. శిశువుల్లో తలెత్తే అనేక రుగ్మతల నిర్మూలనకు అడ్డుగోడగా నిలుస్తాయి. అప్పుడే పుట్టిన శిశువుకు పాలు ఇచ్చేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవాలి.

పాలు పట్టిన వెంటనే పడుకోబెడితే.. ఊపిరితిత్తుల్లోకి, ముక్కు లోపలికి పాలు వెళ్లి డేంజ‌ర్ అయ్యే ఛాన్సులు ఎక్కువ‌గా ఉన్నాయి. అలాగే ప్రతి తల్లికీ బిడ్డపై ప్రేమ, మమకారం ఎక్కువగానే ఉంటాయి. అయితే త‌ల్లి అనారోగ్యంగా ఉన్నప్పుడు బిడ్డకు కాస్త దూరంగా ఉంచడం వలన ఇద్దరికీ మంచిదే ముఖ్యంగా మీ బిడ్డకు. మీకన్నా మీ బిడ్డలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి.

బిడ్డకు పాలు పట్టే తల్లి ప్రశాంతమైన మానసిక స్థితిలో ఉండడంతో పాటు శుభ్రత పాటించాలి. పుట్టిన శిశువును ఆరు నెలల వరకు తల్లి పక్కన పడుకోబెట్టడం ఉత్తమం. దీని ద్వారా శిశువు ఆరోగ్యంగా ఉండడంతో పాటు తల్లీబిడ్డల మధ్య అనుబంధం పెరుగుతుంది. అలాగే చేతులు శుభ్రంగా సబ్బుతో లేదా కొన్ని చేతులను శుభ్రం చేసుకునే కొన్ని రకాల క్రీములను అప్లై చేసుకుని బాగా క్లీన్ చేసుకుని బిడ్డను చేతులలోకి తీసుకుని బిడ్డకు పాలు పట్టించడం చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: