సాధార‌ణంగా ప్ర‌తి మ‌హిళ‌ల‌కు తాను త‌ల్లి కాబోతున్నాను అని తెలిసిన‌ప్ప‌టి నుంచీ ఉండే ఆనందం అంతా ఇంతా కాదు. మాతృత్వం స్త్రీ పునర్జన్మ లాంటిది. గర్భవతి అని తెలిసిన క్షణం నుంచి పుట్టబోయే బిడ్డను గూర్చి ఎన్నో కలలు కంటుంది. మరెన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రతి స్ర్తీ అమ్మగా మారి తనజన్మను సార్థకం చేసుకోవాలని ఆరాటపడుతుంది. అలాగే ప్రతి తల్లి మంచి తెలివితేటలు, బలం మరియు మంచి ఆరోగ్యం ఉన్న తన బిడ్డ పుట్టాలని కలలు కంటుంది.

 

అయితే అవి త‌ల్లి తీసుకునే జాగ్ర‌త్త‌లు వ‌ల్లే సాధ్యం అవుతుంది. 60 నుంచి 70 శాతం మెదడు ఎదుగుదల ఫ్యాట్స్ నుండి జరుగుతుంది అన్న విషయం దృష్టిలో పెట్టుకొని మనం ఆహారంలో ఎక్కువ సహజమైన ఫ్యాట్స్ ఉండేలా చూసుకోవాలి. అంటే ఒమేగా 6 ఫ్యాటీ ఆసిడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ తీసుకోవాలి. గర్భవతిగా ఉన్నపుడు మీకు మతిమరపు రాకుండా చూసుకోవడాం మంచిది. చాలా మంది మహిళలు ప్రెగ్నన్సీ సమయంలో చాలా విషయాలు తొందరగా మర్చిపోతాము అని చెప్తుంటారు. 

 

ఆలా జరగకుండా ఉండాలి అని అంటే ఐరన్ అధికంగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి. ఐరన్ ఎక్కువుగా ఉన్న ఆహరం తినడం వలన బిడ్డ బరువు తక్కువగా పుట్టే ప్రమాదం కూడా తగ్గుతుంది. పిండం ఎదుగుదలకు ప్రోటీన్స్‌లు దోహదం చేస్తాయి. గర్భస్థ శిశువుకు రక్తం వృద్ధి కావడానికి, మెదడు బలోపేతం కావడానికి ఎంతో తోడ్పాడుతాయి. గొర్రె మాంసం, లివర్‌, చికెన్‌, బీన్స్‌, చిరుధాన్యాల్లో ప్రోటీన్స్‌ అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డకే కాకుండా తల్లికి కూడా ఎంతో మేలు కల్గిస్తాయి. 

  

మరింత సమాచారం తెలుసుకోండి: