కావాల్సిన ప‌దార్థాలు:
చింతచిగురు- ఒక కప్పు
పల్లీలు- ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌
ఎండుమిర్చి-  ఎనిమిది
వెల్లుల్లి రెబ్బలు- నాలుగు

 

నూనె- త‌గినంత‌
ఉప్పు- రుచికి స‌రిప‌డా
ధనియాలు- రెండు టీ స్పూన్లు
సెనగపప్పు- రెండు టీ స్పూన్లు

 

త‌యారీ విధానం: 
ముందుగా చింతచిగురును శుభ్రంగా కడిగి తడిపోయేదాకా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో రెండు చెంచాల నూనె వేడిచేసి పల్లీలూ, ధనియాలూ, ఎండుమిర్చి, వెల్లుల్లిరెబ్బలూ, సెనగపప్పూ వేసుకోవాలి. అన్నీ వేగాక ఓ ప్లేట్‌లోకి తీసుకుని ప‌క్కన పెట్టుకోవాలి. మ‌ళ్లీ అదే పాన్‌లో రెండు స్పూన్ల నూనె వేడిచేసి చింతచిగురును వేయించుకుని తీసుకోవాలి. 

 

ఇప్పుడు ముందుగా వేయించుకున్న తాలింపును మిక్సీ జారులోకి తీసుకుని తగినంత ఉప్పు చేర్చి మెత్తని పొడిలా చేసుకోవాలి. తర్వాత వేయించిన చింతచిగురు కూడా వేసి పొడిలా చేసుకుంటే సరిపోతుంది. అంతే చింతచిగురు పొడి రెడీ. దీన్ని వేడి వేడి రైస్‌లో వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: