కావాల్సిన ప‌దార్థాలు:
వెల్లుల్లి రెబ్బ‌లు- ఎనిమిది
ఉల్లిపాయలు- రెండు
కరివేపాకు- ఐదు రెబ్బ‌లు
చింతపండు- నిమ్మకాయలంత

 

పసుపు- అర టీ స్పూన్‌
ఆవాలు- అర టీ స్పూన్‌
జీలకర్ర- అర టీ స్పూన్‌

 

ఎండుమిర్చి- మూడు
కొత్తిమీర- ఒక క‌ట్ట‌
పంచదార- రెండు టీస్పూన్లు
ఉప్పు- రుచికి స‌రిప‌డా

 

తయారీ విధానం: ముందుగా ఒక బౌల్‌లో రెండు లీటర్ల నీళ్లలో చింతపండు రసం తీసి స్టవ్‌మీద పెట్టి మరిగిస్తూ ఉండాలి.  ఇప్పుడు మ‌రో పాన్‌లో నూనె వేసి ఆవాలు, జీల‌క‌ర్ర‌, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. అందులోనే చిదిమిన వెల్లుల్లి, సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, పసుపు వేసి బాగా వేయించాలి.

 

తరవాత దీన్ని మరుగుతున్న చింతపండు రసంలో వేసి తిప్పాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసి మరో పావుగంట మరిగించాక దించేముందు పంచదార, కరివేపాకు తురుము, కొత్తిమీర తురుము చేర్చి మరో ప‌ది నిమిషాలు మరిగించి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ ఆంధ్రా వెల్లుల్లి చారు రెడీ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: