కాజు క్యాప్సికం మసాలా కర్రీ ఇలా చేస్తే నిజంగానే అదిరిపోతుంది.. కానీ చాలామందికి తెలియదు.. అయితే అలాంటి వాళ్ళు అందరూ కేసుల కాజు క్యాప్సికం కర్రీ ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. కాజు క్యాప్సికం కర్రీని ఇలా చేసుకొని తినండి.. అంతే.. ఇంకా... ఈ కర్రీ ఎంతో అద్భుతంగా ఉంటుంది.

 

కావాల్సిన పదార్ధాలు.. 

 

క్యాప్సికం - ఆరు,

 

ఎరుపురంగు క్యాప్సికం - రెండు, 

 

పాలు - అరకప్పు, 

 

ఉల్లిపాయలు -మూడు, 

 

వెల్లుల్లి రెబ్బలు - పదిహేను, 

 

పసుపు - చెంచా, 

 

కారం - చెంచా, 

 

గరం మసాలా - అర చెంచా, 

 

జీలకర్రపొడి - పావు చెంచా, 

 

గసగసాలు -ముప్పావు చెంచా, 

 

కొబ్బరి తురుము - టేబుల్‌ స్పూను, 

 

జీడిపప్పు - పన్నెండు,

 

జీలకర్ర - చెంచా, 

 

ఉప్పు -తగినంత, 

 

నూనె - పావుకప్పు.

 

తయారీ విధానం... 

 

కాజు క్యాప్సికం మసాలా కర్రీ చేసే గంట ముందు జీడిపప్పు, గసగసాలు నీళ్లలో నానబెట్టుకోవాలి. ఆతరవాత అందులో కొబ్బరి తురుము, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా నీళ్లు పోసి మిక్సీలో వేసి మెత్తని పేస్టులా తయారు చేసి పెట్టాలి. ఇంకా ఇప్పుడు బాణలిలో నూనె వేసి అతి వేడి అయ్యాక అందులో కాస్త జీలకర్ర వేసి వేయించాలి. ఆతర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి అవి వేగాక క్యాప్సికం ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, గరం మసాల, జీలకర్రపొడి వేసి బాగా కలిపి మూత పెట్టాలి. కాసేపటికి క్యాప్సికం ముక్కలు మగ్గుతాయి. అప్పుడు పాలు, ముందుగా చేసుకున్న పేస్టు వేసి బాగా కలపాలి. కాసేపటికి ఈ కర్రీని దించేయాలి. అంతే కాజు క్యాప్సికం మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. అమ్మ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి వెంటనే ఈ కర్రీని చేపించేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: