కావాల్సిన ప‌దార్థాలు:
అల్లం- ఒక‌ కిలో
పుట్నాలు- పావు కిలో
బెల్లం- ఒక‌ కిలో
నూనె- వంద గ్రా

 

వెల్లుల్లి- యాబై గ్రా
జీలకర్ర- యాబై గ్రా
ఉప్పు-  యాబై గ్రా

 

ధనియాలు- యాబై గ్రా
పచ్చిమిర్చి- అర కిలో
కరివేపాకు-  యాబై గ్రా
పసుపు- అర టీస్పూన్‌

 

త‌యారీ విధానం: ముందుగా అల్లం తోక్క‌ తీసి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు వాటిని ముక్కలుగా కోసుకుని ఒక ప్లేటులో ఆర‌బెట్టుకోవాలి. తర్వాత స్టవ్‌పై పాన్ పెట్టి, అందులో నూనె వేసి అల్లం ముక్కలను వేసి కొద్దిసేపు వేయించాలి. దీనికి జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు అన్నీ జత చేసి కొద్దిసేపు అన్నింటినీ వేయించి మరో గిన్నెలోకి తీసుకోవాలి.

 

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చ‌ల్లార‌నిచ్చి గ్రైండర్‌లో వేసి అందులో పుట్నాలు, బెల్లం, చింతపండు, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అంతే ఎంతో సులువైన, రుచిక‌ర‌మైన అల్లం చట్ని రెడీ. వేడి వేడి రైస్‌లో లేదా ఇడ్లీలో వేసుకుంటే తింటే సూప‌ర్ అనాల్సిందే. కాబ‌ట్టి మీరు కూడా ఓసారి ట్రై చేసేయండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: